
ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు యాజమాన్యం మాజీ ఆటగాడు, మాజీ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. వేడ్ 2022, 2024 సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు.
We love this Saturday Surprise, Wadey! 😁
Welcome back as our 𝐀𝐬𝐬𝐢𝐬𝐭𝐚𝐧𝐭 𝐂𝐨𝐚𝐜𝐡.
Matthew Wade | #AavaDe | #TATAIPL2025 pic.twitter.com/kIbV73qxL9— Gujarat Titans (@gujarat_titans) March 8, 2025
వేడ్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనలేదు. వేడ్ ఆటగాడిగా కాకుండా కోచింగ్ రోల్‌లో గుజరాత్‌తో జతకట్టడం విశేషం. వేడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించిన విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. ఐపీఎల్‌లో వేడ్ మొత్తంగా 15 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 12 గుజరాత్ తరఫున ఆడాడు. 2022 సీజన్‌లో గుజరాత్ టైటిల్ గెలిచిన జట్టులో వేడ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.
వేడ్ తదుపరి ఐపీఎల్ సీజన్‌లో హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్, అసిస్టెంట్ కోచ్‌లు ఆశిష్ కపూర్, నరేందర్ నేగిలతో కలిసి పని చేస్తాడు. 37 ఏళ్ల వేడ్ ఇటీవలే హోబర్ట్ హరికేన్స్ తరఫున బిగ్‌బాష్ లీగ్ గెలిచాడు. ఆటగాడిగా ఉంటూనే వేడ్ కోచింగ్ అవకాశాల కోసం వెతుకుతున్నాడు. విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ కూడా ఇలాగే (ఆటగాడిగా కొనసాగుతూనే) కోచింగ్ డిపార్ట్‌మెంట్‌లో సెట్ అయ్యాడు.
పోలార్డ్ కూడా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన ఫ్రాంచైజీలోనే (ముంబై ఇండియన్స్) కోచ్‌గా స్థిరపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ 2025 సీజన్ నుంచి కొత్త యాజమాన్యం అండర్‌లో మ్యాచ్‌లు ఆడనుంది. 2025 సీజన్‌ను గుజరాత్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. ఈ సీజన్‌లోనూ గుజరాత్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గుజరాత్ గత సీజన్‌ను ఎనిమిదో స్థానంతో ముగించింది. 2024 సీజన్‌లో గుజరాత్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయాలు సాధించింది.
2025 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మహిపాల్ లోమ్రార్, షారుక్ ఖాన్, నిషాంత్ సింధు, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయికిషోర్, కుమార్ కుషాగ్రా, జోస్ బట్లర్, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిస రబాడ, ప్రసిద్ద్ కృష్ణ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment