
తొలి వన్డే ఆసీస్‌దే
బ్రిస్బేన్: 78 పరుగులకే 5 వికెట్లు పడిన దశలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (100 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆస్ట్రేలియా జట్టుకు ఆపద్బాంధవుడిలా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సెం చరీ సాధించి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఫలితంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 92 పరుగుల తేడా తో నెగ్గింది.
రెండో వన్డే రేపు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. తొలుత 50 ఓవర్లలో 9 వికెట్లకు 268 పరుగులు చేయగా... పాక్ 42.4 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఫాల్క్‌నర్‌కు నాలుగు, కమ్మిన్స్‌కు మూడు వికెట్లు దక్కాయి.