T20 World Cup 2021 Winner Australia Players Drink From Shoe Celebration Video Viral - Sakshi
Sakshi News home page

T20 WC 2021 Winner Australia: డ్రెస్సింగ్‌ రూంలో సెలబ్రేషన్స్‌.. షూలో డ్రింక్స్‌ తాగుతూ సంబరాలు.. అరె ఏంట్రా ఇది!

Published Mon, Nov 15 2021 10:02 AM | Last Updated on Mon, Nov 15 2021 12:38 PM

T20 WC 2021 Winner Australia: Players Drink From Shoes Celebrations Video Viral - Sakshi

T20 WC 2021 Winner Australia: Players Drink From Shoes Celebrations Video Viral: ఆస్ట్రేలియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌ అందించిన ఆరోన్‌ ఫించ్‌ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. నవంబరు 14న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న ఆసీస్‌ జట్టు చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కంగారూలు.. కివీస్‌ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపుబాట పట్టించారు.

ఇక చారిత్రాత్మక, చిరస్మరణీయ విజయం సాధించిన నేపథ్యంలో డ్రెస్సింగ్‌ రూంలో వెరైటీగా సెలబ్రేట్‌ చేసుకుంది ఫించ్‌ టీమ్‌. బూట్ల(షూ)లో డ్రింక్స్‌ నింపుకుని వాటిని తాగుతూ ఆటగాళ్లు ఎంజాయ్‌ చేశారు. సెమీస్‌ హీరోలు మాథ్యూ వేడ్‌, మార్కస్‌ స్టొయినిస్‌ షూ విప్పేసి అందులో డ్రింక్స్‌ నింపుకుని తాగుతూ ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అరె ఏంట్రా ఇది.. షూతో డ్రింక్స్‌ తాగటం... మీరు సూపర్‌.. వరల్డ్‌కప్‌ గెలిచారు కదా... మీ ఇష్టం కానీయండి.. కానీయండి’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా షూలో డ్రింక్స్‌ తాగటం ఆస్ట్రేలియన్ల సంప్రదాయాల్లో ఒకటి. అదృష్టం వరించినప్పుడు సంతోషంతో లేదంటే.. ఏవైనా కఠిన శిక్షల బారిన పడినపుడు ఇలా చేయడం వారికి అలవాటు.

చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్‌.. ఇతర జట్ల ప్రైజ్‌ మనీ ఎంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement