బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటినుంచే సన్నాహాకాలు ప్రారంభించింది. దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2024-25 సీజన్‌లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ మినహా మిగితా ఆసీస్ అగ్రశ్రేణి ఆటగాళ్లంతా పాల్గోంటున్నారు.
అయితే ఈ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ నాథన్ లియాన్ గల్లీ క్రికెట్ మాదరి బంతిని పొదల్లో వెతుకుతూ నవ్వులు పూయించాడు. ఈ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్‌కు లియాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అసలేం జరిగిందంటే?
సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 56 ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి క్యారీ భారీ సిక్సర్ బాదాడు. దెబ్బకు బంతి మైదానం వెలుపుల ఉన్న పొదల్లో పడింది. ఈ క్రమంలో న్యూ సౌత్ వేల్స్ ఫీల్డర్లు బంతిని ఆ పొదల్లో వెతకడం ప్రారంభించారు. కానీ బంతి కన్పించలేదు.
దీంతో బంతిని వెతికేందుకు లియాన్ స్వయంగా రంగంలోకి దిగాడు. అయితే అతడికి ఓ బంతి దొరికింది. కానీ లియాన్‌కు దొరికింది రెడ్ బాల్ కాదు వైట్ బాల్. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడో కన్పించకుండా పోయిన బంతి ఇప్పుడు నాథన్‌కు దొరింది.
కానీ తాజాగా పోయిన బంతి మాత్రం వారికి దొరకలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా ఎటువంటి సంఘటనలు ఎక్కువగా గల్లీ క్రికెట్‌లో జరుగుతూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment