సిడ్నీ: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ ఔట్ కావడమనేది సర్వసాధారణం. మరి బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి, అది కాస్తా పైకి లేచి బౌలర్ చేతిలో పడితే.. అక్కడ బ్యాట్స్‌మన్‌ను దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. ఈ తరహాలో బ్యాట్స్‌మన్ ఔటైన ఘటన ఆస్ట్రేలియా క్రికెట్‌లో చోటు చేసుకుంది. షెఫల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్-వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది.
ఇక్కడ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న హిల్టన్ కార్ట్‌రైట్ రెండో ఇన‍్నింగ్స్‌లో న్యూసౌత్‌వేల్స్ లెగ్ స్పిన్నర్ జాసన్ సంగా వేసిన బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటివరకూ 45 బంతులాడి 3 పరుగులు మాత్రమే చేసిన కార్ట్‌రైట్ కాస్త దూకుడు పెంచే క‍్రమంలో భారీగా షాట్ ఆడబోయాడు. అయితే అది కాస్తా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నిక్ లార్కిన్ హెల్మెట్‌కు తగిలి అంతే వేగంతో పైకి లేచింది. గాల్లోకి లేచిన ఆ బంతిని బౌలర్ సంగా క్యాచ్ పట్టుకోవడంతో కార్ట్‌రైట్ వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Of all the ways to get out 🙈#SheffieldShield | #NSWvWA pic.twitter.com/iTLUxQ3CfF
— #7Cricket (@7Cricket) 26 February 2019
Comments
Please login to add a commentAdd a comment