![Ian Chappell Slams Switch Hit - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/6/Maxwell.gif.webp?itok=C5k_GBxu)
సిడ్నీ; క్రికెట్‌లో స్విచ్ హిట్ షాట్లకు చరమగీతం పాడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని రోజులుగా స్విచ్ హిట్ షాట్లపై పదే పదే వార్తలో నిలుస్తున్న చాపెల్.. ఒకవేళ ఆ షాట్లు ఆడితే దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాలని సూచించాడు. ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ తరహా షాట్లతో టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్విచ్ షాట్ అనేది బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని, ఇది సరికాదని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు రాసిన ఒక కాలమ్‌లో స్విచ్ హిట్‌పై ఇయాన్ చాపెల్ ధ్వజమెత్తాడు. (పృథ్వీ షా, గిల్ డకౌట్లు.. రహానే శతకం)
‘స్విచ్ హిట్టర్లకు ఇది చాలా ప‍్రయోజనం చేకూరుస్తుంది. ఆ షాట్‌ను బ్యాన్ చేయడమే మార్గం. లేకపోతే ఆ బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్రకటించాలి’ అని పేర్కొన్నాడు. ఇది ఫీల్డ్ అంపైర్లకు అదనపు పనిగా మారిపోతుందని అంతర్జాతీయ మాజీ అంపైర్ సైమన్ టైఫల్ పేర్కొన్నాడు. అది స్విచ్ హిట్ అవునా.. కాదా అనే విషయాన్ని అంచనా వేయడం అంపైర్లకు కొన్ని సందర్భాల్లో కఠినంగా మారిపోతుందన్నాడు. అయితే దీనితో చాపెల్ విభేదించాడు. ఇది కాస్త కఠినతరమే అయినా తప్పదన్నాడు. స్వేర్ లెగ్ అంపైర్ ఎప్పుడూ బ్యాట్స్‌మన్ కాళ్ల కదిలికలను చూస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని వారికే అప్పచెప్పాలన్నాడు. స్టంపింగ్ విషయాన్ని లెగ్ అంపైర్ ఎలా చూస్తాడో అలానే స్విచ్ హిట్ల పని కూడా వారికే అప్పచెబితే బాగుంటుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment