తెలివిగా వ్యవహరించిన కార్తిక్‌.. లాస్ట్‌ మ్యాచ్‌ హీరో జీరో అయ్యాడు | Full marks For Karthik And Rohit Sharma Going Review Rossouw Wicket | Sakshi
Sakshi News home page

తెలివిగా వ్యవహరించిన కార్తిక్‌.. లాస్ట్‌ మ్యాచ్‌ హీరో జీరో అయ్యాడు

Oct 30 2022 6:44 PM | Updated on Oct 30 2022 7:53 PM

Full marks For Karthik And Rohit Sharma Going Review Rossouw Wicket - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన రొసౌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను ఔట్‌ కావడంలో దినేశ్‌ కార్తిక్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ వేశాడు. ఓవర్‌లో మూడో బంతి ఇన్‌స్వింగ్‌ అయి రొసౌ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. దీంతో టీమిండియా అప్పీల్‌కు వెళ్లగా అంపైర్‌ ఔటివ్వలేదు.

అయితే బౌలర్‌ అర్ష్‌దీప్‌ ఎల్బీ విషయంలో అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో  రోహిత్‌ కూడా రివ్వూకు మొగ్గుచూపలేదు. కానీ కార్తిక్‌ మాత్రం మిడిల్‌ స్టంప్‌ను తాకుతుందని కచ్చితంగా పేర్కొన్నాడు. కార్తిక్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లిన రోహిత్‌ ఫలితం సాధించాడు. రిప్లేలో బంతి ఇన్‌స్వింగ్‌ అయి మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లు  కనిపించింది. రొసౌ ఔట్‌ అని అంపైర్‌ ప్రకటించాడు. దీంతో కార్తిక్‌ను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ సహా మిగతా ఆటగాళ్లంతా అభినందనల్లో ముంచెత్తారు. ఫలితంగా లాస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో హీరోగా నిలిచిన రొసౌ ఈ మ్యాచ్‌లో జీరోగా నిలిచాడు.

చదవండి: తీరు మారని కేఎల్‌ రాహుల్‌.. పక్కనబెట్టాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement