Ind vs Ban 1st Test: Taijul Islam traps Virat Kohli in front - Sakshi
Sakshi News home page

IND vs BAN: ఏంటి కోహ్లి అంత ఈజీగా వికెట్‌ ఇచ్చేశావు.. వీడియో వైరల్‌

Published Wed, Dec 14 2022 1:22 PM | Last Updated on Wed, Dec 14 2022 3:33 PM

IND vs BAN: Taijul Islam traps Virat Kohli in front in 1st Test - Sakshi

ఛాటోగ్రామ్‌ వేదికగా తొలి టెస్టులో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌ తొలిసెషన్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌ బౌలర్లు పైచేయి సాధించారు. తొలి సెషన్‌లో బంగ్లా బౌలర్లు  కేవలం 85 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టారు.

భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లలో శుబ్‌మాన్‌ గిల్‌(22), కేఎల్‌ రాహుల్‌(22), విరాట్‌ కోహ్లి(1) తీవ్రనిరాశపరిచారు. అయితే భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ మాత్రం బంగ్లాదేశ్‌ బౌలర్లపై కాసేపు ఎదురు దాడికి దిగాడు. 45 బంతులు ఎదుర్కొన్న పంత్‌ 2 ఫోర్లు, 6 ఫోర్లతో 46 పరుగులు చేసి దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాడు.

ట్రాప్‌లో చిక్కుకున్న కోహ్లి
తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లిని అద్భుతమైన బంతితో బంగ్లా స్పిన్నర్‌  తైజుల్ ఇస్లామ్‌ బోల్తా కొట్టించాడు. 20 ఓవర్‌ వేసిన తైజుల్ ఇస్లామ్‌ బౌలింగ్‌లో మూడో బంతిని లెగ్‌ సైడ్‌ ఆడటానికి కోహ్లి ప్రయత్నించాడు. అయితే పిచ్‌ మిడిల్‌లో పడ్డ బంతి అద్భుతంగా టర్న్‌ అవుతూ కోహ్లి వెనుక ప్యాడ్‌కు తాకింది.

వెంటనే బౌలర్‌తో వికెట్‌ కీపర్‌ ఎల్బీకి అప్పీల్‌ చేయగా..అంపైర్‌ వెంటనే వేలు పైకెత్తాడు. అయితే కోహ్లి రివ్యూ తీసుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. ఎందుకంటే విరాట్‌ క్లియర్‌గా వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు.
చదవండి: BAN Vs IND: చాలా దూకుడుగా ఆడావు! ‘శభాష్‌’ రాహుల్‌.. కెప్టెన్‌పై నెటిజన్ల సెటైర్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement