జడేజా సూపర్‌ డెలివరీ.. స్టోక్స్‌కు మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌ | Jadeja Outsmarts Ben Stokes As England Fumble In 1st Session | Sakshi
Sakshi News home page

IND vs ENG: జడేజా సూపర్‌ డెలివరీ.. స్టోక్స్‌కు మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Published Fri, Feb 23 2024 12:49 PM | Last Updated on Fri, Feb 23 2024 1:04 PM

Jadeja Outsmarts Ben Stokes As England Fumble In 1st Session - Sakshi

రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్‌ ఔటయ్యాడు. భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతితో స్టోక్సీని బోల్తా కొట్టించాడు.  ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ వేసిన జడేజా తొలి బంతిని గుడ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు.

ఆ బంతిని స్టోక్సీ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి తక్కువ ఎత్తులో బౌన్స్‌ అయ్యి స్టోక్స్‌ ఫ్రంట్‌ప్యాడ్‌ను తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ సైతం అంతే వేగంగా ఔట్‌ అంటూ వేలు పైకెత్తాడు. స్టోక్స్‌ కనీసం రివ్యూ కూడా తీసు​కోకుండానే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లకు ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ ఆకాష్‌ దీప్‌ 3 వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement