ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌..? | DRS could make IPL debut in 2018 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌..?

Published Sat, Dec 16 2017 4:37 PM | Last Updated on Sat, Dec 16 2017 4:37 PM

 DRS could make IPL debut in 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లోకి డీఆర్‌ఎస్‌(డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌)ను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో క్రికెట్‌లో కీలకంగా మారిన అంపైర్‌ తుది సమీక్ష నిర్ణయం రాను రాను అన్ని ఫార్మట్‌లకు విస్తరించనుంది. దీంతో ఐపీఎల్‌-2018 సీజన్‌లో డీఆర్‌ఎస్‌ ప్రేశపెట్టాలని బీసీసీఐ భావిస్తున్నదని, దీనికి కసరత్తులు మొదలు పెట్టినట్లు సమాచారం.

అయితే విశాఖపట్టణంలో ఐసీసీ ప్యానెల్‌కు బయట ఉన్నభారత టాప్‌ పది మంది అంపైర్లతో  బీసీసీఐ వర్క్‌షాప్‌ నిర్ణయించినట్లు ఓ జాతీయ ఛానెల్‌ పేర్కొంది. ఆ సదరు ఛానెల్‌తో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు.

డీఆర్‌ఎస్‌ విషయంలో బీసీసీఐ వర్క్‌షాప్‌ నిర్వహించటం ఇదే తొలిసారని, ఇక భవిష్యత్తులో అంపైర్‌ తుది నిర్ణయంలో టెక్నాలజీ కీలక మారునుందన్నారు. ఈ నేపథ్యంలో డీఆర్‌ఎస్‌పై అంపైర్లకు అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఇక ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌ ప్రవేశ పెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 

ఈ వర్క్‌షాప్‌ ఐసీసీ అంపైర్ల కోచ్‌ డెనిస్‌ బర్న్స్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ పాల్‌ రిఫ్ఫిల్‌ల నేతృత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. పాల్‌ రిఫ్పిల్‌ 2004-05 లో అంపైర్‌గా మారారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement