టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఓటమి పాలయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కెప్టెన్.. ఓపెనర్ రోహిత్ శర్మ 60 పరుగులతో ఆరంభంలోనే గట్టి పునాది వేసి విజయానికి బాటలు పరిచాడు. తద్వారా టీమిండియా 1000వ వన్డేలో విజయం సాధించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక పూర్తిస్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటింగ్‌లో సూపర్ షాట్స్ ఆడాడు. రోహిత్ తాను ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోరు 84. అందులో రోహిత్‌వే 60 పరుగులున్నాయంటే ఎంత వేగంగా ఆడాడో అర్థమవుతుంది.
చదవండి: Rishabh Pant: ఎంత పని చేశావు సూర్య.. పంత్‌ను వెంటాడిన దురదృష్టం
51 బంతుల్లో 60 పరుగులు సాధించిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ హైలెట్‌గా నిలిచింది. జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రోహిత్ క్రీజులోనే ఉండి వెనక్కి వంగి డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఇది చూసిన పొలార్డ్ కోపంతో రోహిత్‌కు ఒక లుక్ ఇచ్చాడు.. తన పళ్లు నూరుతూ ఏంటి రోహిత్ అన్నట్లుగా ఆ లుక్‌లో అర్థం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ear Therapy @ImRo45 💉pic.twitter.com/mrEJaU8oyW
— 🎭 (@CloudyCrick) February 6, 2022
Comments
Please login to add a commentAdd a comment