Frustration
-
అమరావతిపై వాస్తవాల్ని తట్టుకోలేకపోతున్న సీఎం చంద్రబాబు
-
నీకు నాలెడ్జ్ ఉందా ?.. రాజగోపాల్ రెడ్డి కోపం వచ్చింది..
-
తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు
తిరుపతి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈవో గౌతమి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం తొలిసారి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు అసహనానికి గురయ్యారు. అధికారులు పుష్ప గుచ్చాలు ఇస్తున్నప్పటికీ తీసుకోకుండా వాటిని పక్కకు తోసేశారు. అదే సమయంలో స్థానిక నేతలు ఇచ్చిన బొకేలను మాత్రం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణం చేశాక స్పెషల్ విమానంలో కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అయితే.. గాయత్రి నిలయం వద్ద ఆయన వాహనం దిగి నేరుగా లోపలికి వెళ్లారు. అప్పటికే లోపల ఉన్న తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు యత్నించగా.. సీఎం చంద్రబాబు తిరస్కరించారు. అయితే.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఇచ్చిన గుచ్ఛాలను మాత్రం ఆయన నవ్వుతూ తీసుకున్నారు. వాహనం దిగిన తనకు స్వాగతం పలికేందుకు అధికారులు బయటకు రాకపోవడంతోనే ఆయన ప్రవర్తించి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొటోకాల్ అంశం తెరపైకి వచ్చింది. ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబుతిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా విజయవాడ వెళ్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకోనున్నారాయన. అనంతరం ఈ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే కీలక హామీలపైఆయన సంతకాలు చేస్తారని సమాచారం. -
తారస్థాయికి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్
నూజివీడు/దర్శి/బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)/కరప/కాకినాడ సిటీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు రోజురోజుకు తన స్థాయిని మర్చిపోయి రెచ్చిపోతున్నారు. ఆయన, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు ప్రజాస్పందన లేకపోవడం, వచ్చే ఎన్నికల్లోనూ ఘోర ఓటమి తప్పదని స్పష్టం కావడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుతోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.కొద్దిరోజుల క్రితం జగన్‌ను చంపేస్తే ఏమవుతుందంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు శనివారం నూజివీడు, దర్శి, కాకినాడల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మరింత రెచ్చిపోయారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయనకు ప్రజలు ఉరేయాలని పిలుపునిచ్చారు. సీఎంపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. దూషణలపర్వానికి దిగారు. చంద్రబాబుకు ఓటమి ఖాయమని తేలడంతోనే ఇలా దిగజారి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల అరాచకానికి ఫుల్స్టాప్ పెట్టాలి.. రాబోయే ఎన్నికల్లో జగన్ ఐదేళ్ల అరాచకానికి ప్రజలు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు, ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సీఎం లుచ్ఛా ముఖ్యమంత్రి, మోసగాడు, అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు, బందిపోటు దొంగ, నియంత అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల సంపద అంతా తన దగ్గరే ఉండాలనుకుంటారని మండిపడ్డారు. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో వైఎస్సార్సీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రిని సాగనంపాలన్నారు. ఈ సైకోకు తోడు కాకినాడ సిటీలో మరో సైకో ఉన్నాడన్నారు. కాకినాడను గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్‌గా, దొంగ బియ్యం అక్రమ రవాణా కేంద్రంగా తయారు చేశారన్నారు. జగన్‌కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని విమర్శించారు. ‘భూమి మీదా.. జగన్‌దా.. జగనన్న భూహక్కు చట్టం అంటా తమ్ముళ్లూ.. మీ భూమి మీద జగన్ కన్నుపడింది’ అని ఆరోపించారు. భవిష్యత్‌లో భూముల రికార్డ్స్ ఏమీ ఉండవని, జిరాక్స్ కాపీలే ఇస్తారని, వాటితో ముడ్డి తుడుచుకోవడమేనని చెప్పారు. అమెరికాలో ఉన్న జగన్ బినామీ కంపెనీకి జిరాక్స్ కాపీలను స్టోర్ చేసే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ల్యాండ్టైట్లింగ్ చట్టం నల్ల చట్టమని, మీ భూమిని కాజేసే చట్టమని, దొంగోడు, బూచోడు మనందరి భూమిపై కన్నేశాడని తీవ్ర విమర్శలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని, 25 ఏళ్ల క్రితం సెల్‌ఫోన్ తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశానన్నారు. దుర్మార్గుడు సర్వనాశనం చేశాడు.. జగన్ మెడకు ఉరేసే అవకాశం ఉందని.. మే 13న జగన్ పార్టీకి, ఫ్యాన్‌కు ఉరివేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిని దేశంలోనే నంబర్‌వన్ చేయాలనుకున్నానన్నారు. అయితే దుర్మార్గుడు వచ్చి మూడు ముక్కలు ఆడి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. అమరావతి వచ్చి ఉంటే నూజివీడు పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లేదన్నారు. టీడీపీని గెలిపిస్తే నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతానన్నారు. వలంటీర్లను ప్రజలకు సేవ చేసేందుకు పెట్టండి కానీ రాజకీయాలకు కాదని తానే చెప్పానని చంద్రబాబు తెలిపారు. వలంటీర్లను పింఛన్ల విధుల్లో పెట్టవద్దన్నది తానేనని చెప్పారు. పేదలపై కక్ష కట్టి ఏప్రిల్‌లో 33 ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో అని ధ్వజమెత్తారు. కాగా నూజివీడుకు వచ్చిన చంద్రబాబు జనం లేక 40 నిమిషాలపాటు బస్సులోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. కాకినాడలోనూ జనం హాజరుకాలేదు. దీంతో నాయకులపై చంద్రబాబు మండిపడ్డట్టు తెలిసింది.సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ అభిమానుల ఫ్లెక్సీలు దర్శి సభలో సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు, ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘జై జూనియర్ ఎన్టీఆర్.. సీఎం కావాలి జూనియర్ ఎన్టీఆర్’ అంటూ చంద్రబాబు ముందే నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు పక్కన ఉన్న నేతలు ఫ్లెక్సీ దించి పక్కకు పోవాలని హెచ్చరించినా అభిమానులు నినాదాలు చేశారు. దీంతో కింద ఉన్న కేడర్ వారిని బలవంతంగా అక్కడ నుంచి పంపేశారు. -
సిరాజ్‌కు కోపం తెప్పించిన స్మిత్ చర్య
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన స్టీవ్ స్మిత్ తన చర్యతో సిరాజ్‌కు కోపం తెప్పించాడు. రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఇది జరిగింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 86వ ఓవర్లో మూడో బంతి వేయడానికి సిరాజ్ సిద్దమయ్యాడు. రనప్ తీసుకొని బంతి విడవడానికి ముందు స్మిత్ క్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇది సిరాజ్‌కు చిరాకు తెప్పించింది. వెంటనే బంతిని స్మిత్ వైపు కోపంగా విసిరాడు. స్మిత్ చర్యకు కెప్టెన్ రోహిత్ కూడా షాక్ తిన్నాడు.అయితే గ్రౌండ్‌లోని స్పైడర్ కెమెరా అడ్డు రావడంతోనే అలా చేసినట్లు స్మిత్ వివరణ ఇచ్చినప్పటికి సిరాజ్ పట్టించుకోలేదు. నేను రనప్ తీసుకోకముందే ఆపి ఉంటే బాగుండేది కదా అంటూ కోపంతో పేర్కొన్నాడు. అయితే ఇద్దరు సైలెంట్ కావడంతో ఎలాంటి మాటల యుద్దం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో రోజు మొదలైన కాసేపటికే సిరాజ్ బౌలింగ్‌లోనే రెండు వరుస బౌండరీలు బాది టెస్టుల్లో 31వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా స్మిత్‌కు టీమిండియాపై టెస్టుల్లో ఇది తొమ్మిదో సెంచరీ. ఇక 121 పరుగులు చేసిన అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో స్మిత్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. Siraj is the most dislikeable Cricketer i've ever seen.pic.twitter.com/3aGCxXDEyF — ` (@rahulmsd_91) June 8, 2023 చదవండి: #SteveSmith: టీమిండియాకు కొరకరాని కొయ్య.. ఔట్ చేయడం చాలా కష్టం -
ఐ హేట్ దిస్.. బ్రిటన్ రాజు చార్లెస్ చికాకు
డబ్లిన్: బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ కోసం సంతాపాన్ని తెలియజేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో.. ఉత్తర ఐర్లాండ్‌ను సందర్శించిన చార్లెస్.. ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే.. బెల్ఫాస్ట్ సమీపంలోని హిల్స్‌బరో క్యాజిల్(కోట)కు చేరుకున్న ఆయన.. సందర్శకుల పుస్తకంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఛార్లెస్ తన చేతిలోని పెన్ను లీక్ కావడంతో నిరాశతో చెందారు. ‘‘ఓహ్ గాడ్ ఐ హేట్ దిస్ (పెన్)!’’ అంటూ చార్లెస్ లేచి నిలబడి చేతిని తుడుచుకుంటూ ఆ పెన్నును తన భార్య, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాకు అందజేశాడు. ఆపై ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడాయన. I LOVE this pic.twitter.com/cL1KpFA5gI — Rupert Myers (@RupertMyers) September 13, 2022 ఇదిలా ఉంటే.. చార్లెస్ రాజుగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛార్లెస్ చాలా సరదాగా ఉంటారు. కానీ, ఆయనకు షార్ట్‌టెంపర్. అదీ ఇదీ కావాలని అడుగుతుంటారు కూడా’’ అని వెల్లడించారు. నాలుగేళ్ల వయసులో ఛార్లెస్ ఇదిలా ఉంటే.. శనివారం లండన్‌లో పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు, టేబుల్‌పై ఉన్న పెన్ హోల్డర్ అడ్డుతగలడంతో విసుగు చెందిన చార్లెస్.. సహాయకులకు సహాయం చేయమని సైగ చేయడం, తన అసహనాన్ని ప్రదర్శించడం తెలిసే ఉంటుంది. స్వతహాగానే ఆయన ప్రవర్తన అలా ఉంటుందని కొందరు అంటుంటే.. 73 ఏళ్ల ఛార్లెస్ వయసురిత్యా అలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్ శవపేటిక బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకుంది. video courtesy: Daily Mail -
Viral Video: ఈ పిల్లాడి ‘హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్’ మామూలుగా లేదుగా..!
న్యూఢిల్లీ: స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలని భావిస్తారు పిల్లలు. కానీ, ఇంటికి రాగానే హోమ్‌వర్క్ చేయమంటే నిరాశకు లోనవుతారు. అయిష్టంగానే పుస్తకాలు తెరుస్తారు. కొందరైతే.. కోపంతో నేను చేయను పో అని తెగేసి చెప్తారు. ఆ కోవకే చెందుతాడు ఈ పిల్లాడు. హోమ్ వర్క్ చేయమన్న తన తల్లిపైనే అసహనం వ్యక్తం చేశాడు. ఆ బుజ్జాయి మాటలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. హిందీ నోట్‌బుక్‌ను తెరిచిన పిల్లాడు తన తల్లికి ఎదురు సమాధానమిస్తున్నాడు. హోమ్‌వర్క్ చేయలేక తాను ఈ లోకం నుంచి వెళ్లాలనుకుంటున్నాని షాక్ ఇచ్చాడు. ‘మమ్మీ నేను పరేషాన్ అవుతున్న. అసుల ఈ దినియాలోకి ఎందుకు వచ్చాను. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాను, వెళ్లిపోతాను.’ అంటూ తన పెన్సిల్‌ను పదే పదే పుస్తకంపై బాదుతూ చెప్పాడు. ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని అతడి తల్లి అడగగా.. నాకు ఈ ప్రపంచంలో ఉండాలని లేదు, నువ్ అందంగా లేవు అని సమాధానమిచ్చాడు. దానికి ఆమె పడిపడి నవ్వసాగింది. ఆ వీడియోను ఎమోబోయిస్ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. హోమ్ వర్క్ చేయమంటే ఏం జరుగుతుందో చూడండి అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Emo Bois of India (@emoboisofindia) ఇదీ చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్...టచ్ చేయకూడనవి టచ్ చేస్తే ఇలానే ఉంటుంది! -
ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే!
ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ టి20 క్రికెట్లో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి రుచి చూపించాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో పాల్ స్టిర్లింగ్ 51 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. స్టిర్లింగ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. బర్మింగ్హమ్ బేర్స్, నార్త్ హాంట్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా స్టిర్లింగ్ ఇన్నింగ్స్‌లో హైలైట్ అయింది మాత్రం ఒకే ఓవర్లో 34 పరుగులు బాదడం. ఒక్క ఓవర్లో అన్ని పరుగులు బాదినప్పటికి పాల్ స్టిర్లింగ్ మొహంలో నవ్వు కంటే చిరాకే ఎక్కువగా కనిపించింది. విషయంలోకి వెళితే.. జేమ్స్ సేల్స్ బౌలింగ్‌లో పాల్ స్టిర్లింగ్ వరుసగా 6,6,6,6,6,4 బాది మొత్తంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్ మొత్తం జేమ్స్ సేల్స్ షార్ట్ బాల్స్ వేయగా.. తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరొక సిక్సర్ కొడితే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చేది. కానీ స్టిర్లింగ్ తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జేమ్స్ సేల్స్ తన ఆరో బంతిని కూడా షార్ట్ బాల్ వేసినప్పటికి యాంగిల్ మారడం.. స్టిర్లింగ్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి డీప్ థర్డ్‌మన్ దిశగా బౌండరీ వెళ్లింది. దీంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టలేకపోయాననే బాధ పాల్ స్టిర్లింగ్ మొహంలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 క్రికెట్లో మూడో సెంచరీ అందుకున్న స్టిర్లింగ్ పనిలో పనిగా 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐర్లాండ్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 16 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ బేర్స్ పాల్ స్టిర్లింగ్ దాటికి 3 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్ హంట్స్ 14.2 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. చదవండి: RCB: మరో దక్షిణాఫ్రికాలా తయారైంది.. ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో! Alastair Cook: 15 ఏళ్ల కుర్రాడి ముందు 12 ఏళ్ల అనుభవం పనికిరాలేదు 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣ - 34 from an over!@stirlo90 is a cheat code 😲 #Blast22 pic.twitter.com/Sy7ByS4wwm — Vitality Blast (@VitalityBlast) May 26, 2022 -
రోహిత్ శర్మ కళ్లు చెదిరే సిక్స్.. ఆ చూపుకు అర్థమేంటి ?
టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఓటమి పాలయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కెప్టెన్.. ఓపెనర్ రోహిత్ శర్మ 60 పరుగులతో ఆరంభంలోనే గట్టి పునాది వేసి విజయానికి బాటలు పరిచాడు. తద్వారా టీమిండియా 1000వ వన్డేలో విజయం సాధించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక పూర్తిస్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటింగ్‌లో సూపర్ షాట్స్ ఆడాడు. రోహిత్ తాను ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోరు 84. అందులో రోహిత్‌వే 60 పరుగులున్నాయంటే ఎంత వేగంగా ఆడాడో అర్థమవుతుంది. చదవండి: Rishabh Pant: ఎంత పని చేశావు సూర్య.. పంత్‌ను వెంటాడిన దురదృష్టం 51 బంతుల్లో 60 పరుగులు సాధించిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ హైలెట్‌గా నిలిచింది. జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని రోహిత్ క్రీజులోనే ఉండి వెనక్కి వంగి డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఇది చూసిన పొలార్డ్ కోపంతో రోహిత్‌కు ఒక లుక్ ఇచ్చాడు.. తన పళ్లు నూరుతూ ఏంటి రోహిత్ అన్నట్లుగా ఆ లుక్‌లో అర్థం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ear Therapy @ImRo45 💉pic.twitter.com/mrEJaU8oyW — 🎭 (@CloudyCrick) February 6, 2022 -
పాపం రూట్.. రికార్డు సాధించానన్న ఆనందం లేకుండా
యాషెస్ సిరీస్ ఇంగ్లండ్‌కు ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లండ్ మూడోటెస్టును కూడా ఫేలవ రీతిలో ఆరంభించింది. ఓడిన రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. తాజాగా మూడో టెస్టులోనూ అదే పునరావృతమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ మినహా మిగతావారు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. రూట్ మరోసారి అర్థ శతకం(82 బంతుల్లో 50, 4 ఫోర్లు) ఆకట్టుకోగా.. బెయిర్ స్టో 35 పరుగులు చేశాడు. అయితే సరిగ్గా 50 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఔటయ్యాననే కోపంతో రూట్ తన బ్యాట్‌ను కిందకొట్టి అసహనం వ్యక్తం చేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా తాను అర్థసెంచరీ చేసినప్పటికి తన సహచరులెవ్వరు సహకరించలేదన్న కోపమో ఏమోగాని.. రూట్ ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: Ind Vs Sa 1st Test: తొలి టెస్టు డ్రా అవుతుంది.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్ ఇక రూట్ మూడో టెస్టు ద్వారా టెస్టులో మరో రికార్డును అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. తాజా హాఫ్ సెంచరీతో రూట్ ఒక క్యాలెండర్ ఇయర్లో 1680 పరుగులు సాధించాడు. తద్వారా దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమీ స్మిత్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక రూట్ కంటే ముందు టెస్టు కెప్టెన్‌గా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్(1788 పరుగులు, 2006), వెస్టిండీస దిగ్గజం వివ్ రిచర్డ్స్(1710 పరుగులు, 1976) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. ఈ దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ తొలి రోజు రెండు సెషన్లలోనే ముగిసిపోయింది. 65.1 ఓవర్లలో 185 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, లియాన్ చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. చదవండి: Ashes Series 3rd Test: ఆసీస్ బౌలర్ల జోరు.. ఇంగ్లండ్ విలవిల Starc gets the big one - England's captain is gone! Root out for exactly 50 #Ashes pic.twitter.com/cqkjIqCy3W — cricket.com.au (@cricketcomau) December 26, 2021 -
Ravindra Jadeja: క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు
Ravindra Jadeja Clean Bowled Frustated Try To Hit Stumps.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో మెరవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేసింది. అయితే న్యూజిలాండ్ ధీటుగా బదులిస్తుంది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదవండి: Trolls On Wriddhiman Saha: ఏం ఆడుతున్నావయ్యా బాబూ.. ఇకనైనా భరత్‌ను తీసుకుంటారా? ఇక విషయంలోకి వెళితే.. హాఫ్ సెంచరీతో మెరిసిన రవీంద్ర జడేజా అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. అయితే అతను ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిమ్ సౌథీ బ్యూటీ బౌలింగ్‌కు జడేజా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ 86వ ఓవర్లో సౌథీ చివరి బంతి వేయగా.. జడేజా ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు. కాగా బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దీంతో జడేజా కోపంతో బ్యాట్‌ను వికెట్లను కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎందుకో మళ్లీ వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత పెవిలియన్ వెళుతూ తనను తాను తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ షేర్ చేసింది. https://www.bcci.tv/videos/156936/ind-vs-nz-2021-1st-test-day-2-ravindra-jadeja-wicket -
ఔటయ్యానన్న కోపంలో గోడను కొట్టిన కోహ్లి.. వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన కోపాన్ని మరోసారి ప్రదర్శించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రెయిగ్ ఓవర్టన్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. కోహ్లి మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాననే బాధతో పెవిలియన్ చేరాడు. చదవండి: Ajinkya Rahane: రహానే ఎందుకిలా.. అభిమానుల ఆగ్రహం ఈ క్రమంలోనే డ్రెస్సింగ్‌రూమ్‌కు వస్తూ కోపంతో గ్లోవ్స్‌తోనే గోడను బలంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అసలే కోహ్లి సెంచరీ చేయక రెండేళ్లు అవుతుంది. అర్థసెంచరీలు చేస్తున్నప్పటికీ దానిని సెంచరీలుగా మలచలేకపోతున్నానే బాధ తాజా చర్యతో కోహ్లి మొహంలో స్పష్టంగా కనిపించింది. ఇక మ్యాచ్‌లో టీమిండియా 271 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 36, శార్దూల్ ఠాకూర్ 32 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా పాజిటివ్ Virat Kohli is frustrated of his dismissal.#ENGvIND pic.twitter.com/YifSoc9UEe — Mr.Cricket (@MrCricketR) September 5, 2021 -
'సింగిల్ చాలు అన్నానుగా'.. పుజారాపై రోహిత్ అసహనం
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం టీమిండియా 54 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 62, పుజారా 39 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే రోహిత్ శర్మ చతేశ్వర్ పుజారాపై అసహనం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇన్నింగ్స్ 47వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. క్రిస్ వోక్స్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని పుజారా మిడాఫ్ దిశగా ఆడాడు. ఈ సమయంలో పుజారా రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే రోహిత్ సింగిల్‌కే మొగ్గు చూపాడు. పుజారా అది పట్టించుకోకుండా రెండో పరుగు కోసం క్రీజు దాటేశాడు. దీంతో రోహిత్ పుజారా వైపు తిరిగి ''సింగిల్ చాలు అన్నానుగా.. మళ్లీ ఎందుకు పరిగెత్తుతున్నావు'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: Rohit Sharma: ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు.. -
టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు భంగపాటు
కణేకల్లు: మండలంలోని బెణికల్లు గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు భంగ పాటు ఎదురైంది. వివరాలు.. తటస్థంగా ఉన్న కొన్ని కుటుంబాలతోపాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పార్టీలో చేర్పించేందుకు టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బలవంతంగా చేర్పించేందుకు యత్నించారు. కొందరికి పచ్చ చొక్కాలు కూడా కుట్టించి ఇచ్చారు. కొన్ని కుటుంబాలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని శుక్రవారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులను ఊరికి రప్పించారు. కాలవ చేతుల మీదుగా కండువా వేయించాలనుకొన్నారు.. టీడీపీ నాయకులు. పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గతంలో టీడీపీలో ఉన్నోళ్లకే కండువాలు వేసి పార్టీలో చేరారని మాజీ మంత్రి గొప్పలు చెప్పి కార్యక్రమం ముగించేసి వెళ్లిపోయారు. కాగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసుల చేతుల మీదుగా కండువాలు వేయించుకొన్న ఎర్రిస్వామి, పోతప్ప, వన్నూరుస్వామి, సంగప్పతోపాటు మరో రెండు కుటుంబాలు టీడీపీకి చెందినవేనని బెణికల్లు గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు జేజేటీ ప్రభాకర్‌రెడ్డి, జేజేటీ నగేష్ రెడ్డి, భీమిరెడ్డి తెలిపారు. ఊళ్లో కొత్త వారేవరూ పారీ్టలో చేరనందున మాజీ మంత్రి పాతోళ్లకే కండువాలు వేసి కొత్త వారు చేరినట్లు ఫోజులిచ్చారని విమర్శించారు. చదవండి: తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ.. అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి -
అంతా పీడకలలా అనిపిస్తోంది
లండన్: ప్రపంచ కప్ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ఫైనల్ మరుసటి రోజు దీనిపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారంగా స్పందించాడు. ‘నిరాశ మమ్మల్ని ఉప్పెనలా ముంచెత్తింది. ఉదయం లేచి చూస్తే పీడకల కన్నట్లుగా అనిపించింది. మా ఆటగాళ్లంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. మ్యాచ్‌లో ఈ తరహాలో ఓడటం ఏదోలా ఉంది’ అని విలియమ్సన్ తన బాధను వ్యక్తీకరించాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కివీస్ కెప్టెన్... బౌండరీల లెక్క నిబంధనపై ఆచితూచి స్పందించాడు. ‘బౌండరీలను బట్టి విజేతను నిర్ణయించడం సరైందా అంటే నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వలేను. నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని గానీ నేను జవాబు ఇవ్వాల్సి వస్తుందని గానీ అసలెప్పుడూ ఊహించలేదు. ఇంకా ఓటమి బాధలోనే ఉన్నాం. ఇరు జట్లు ఇంత కష్టపడిన తర్వాత బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది సిగ్గుచేటు’ అని అతను వ్యాఖ్యానించాడు. అయితే ఇంత జరిగినా అతను ఈ నిబంధనను విమర్శించడానికి ఇష్టపడకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ‘నిబంధనలు మొదటి నుంచి ఉన్నాయనేది వాస్తవం. కానీ ఇలాంటి నిబంధనతో మ్యాచ్ ఫలితం తేల్చాల్సి వస్తుందని బహుశా ఎవరూ ఊహించకపోవచ్చు. స్టోక్స్ బ్యాట్‌కు తగిలి ఓవర్‌త్రో వెళ్లడం కూడా అలాంటిదే. ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అందరూ దానిని బాగా ఆస్వాదించారు’ అని విలియమ్సన్ చెప్పడం విశేషం. ఫైనల్ ఫలితం తర్వాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ విలియమ్సన్... ‘ఇలాంటి స్థితిలో నవ్వడమో లేదా ఏడవడమో అనే ఒకే ఒక అనుభూతి ఉంటుంది. అయితే కొంత నిరాశ ఉన్నా నాకు కోపం మాత్రం లేదు’ అని విలియమ్సన్ స్పష్టం చేశాడు. -
కొడుకా.. రమేశా!
సాక్షి, జోగిపేట(అందోల్): చేతికి ఎదిగివచ్చిన కొడుకు.. రాత్రి పడుకొని ఉదయం లేచి చూసే సరికి శవంగా మారడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది.. ఎంత పనిచేసావు కొడుకా రమేశు అంటూ గుండలవిసేలా రోదించింది. జీవితంపై విరక్తితో మంగళవారం యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. జోగిపేట పట్టణానికి చెందిన బీర్ల రమేశ్ (26) బీఈడీ పూర్తిచేసిన ఎస్సై, లేదా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొన్ని రోజులుగా సంగారెడ్డిలోనే స్నేహితులతో ఉండి వారితో పాటు సాధన చేస్తున్నాడు. శివరాత్రి పండుగకోసం జోగిపేటకు వచ్చిన ఆ యువకుడు సోమవారం తన ఇంటిలోని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయం లేచి చూడగానే రమేష్ కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఎక్కడకు వెళ్లాడోనని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సోదరుడు అనిల్ మండలం పరిధిలోని మాసానిపల్లి శివారులోని తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగానే అక్కడ రమేష్ చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతుండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. కాలనీవాసులు, మిత్రులు, బంధువులు, అక్కడి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వెంకటేశ్ వచ్చి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోదరుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముక్కు క్యాన్సరే కారణమా..? సోమవారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత తన సెల్‌ఫోన్‌లోని స్టేటస్‌లో నోస్ క్యాన్సర్ అని ముక్కు ఫొటోను పోస్టు చేసారు. కొంత మంది స్నేహితులు ఆ స్టేటస్‌ను చూసి పొద్దున మాట్లాడదామని ఊరుకున్నారు. ఉదయం లేచే సరికి ఈ సంఘటన తెలియడంతో స్నేహితులంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. మూడేళ్ల నుంచి ముక్కుకు సంబంధించి వ్యాధితో బాధ పడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అది క్యాన్సర్ అని మాత్రం చెప్పలేదన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా శవంగా మారడంతో కాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి. రమేశ్ (ఫైల్) -
స్మార్ట్ ఫోన్లో పబ్జీ భూతం..ఆడితే ఇక అంతే..
సాక్షొ, వైరారూరల్: ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లలో కొన్ని రకాల ఆటలకు యువకులు బాకా ఆకర్షితులవుతూ..సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అర్ధరాత్రుళ్ల వరకూ ఫోన్లలో ఆటలాడేలా ప్రేరేపిస్తున్న గేముల్లో పబ్జి అనేది ముఖ్యంగా కనిపిస్తోంది. ఈ ఆట ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా ఆడుతున్నారు. ఒక్కరు, ఇద్దరు లేదా నలుగురు కలిసి ఒకేసారి ఆన్లైన్లో ఆడవచ్చు. ముగ్గురు కలిసి కూడా ఆడొచ్చుకానీ..అధికశాతం నలుగురు మిత్రులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఒక టీం మాదిరి ఏర్పడి ఆన్లైన్లో ఈ ఆటను ఆడుతున్నారు. గేమ్‌లో ఒక ఐలాండ్ ఉంటుంది. అందులో విమానం నుంచి 100 మంది వారికి నచ్చిన ప్రదేశాల్లో దిగుతారు. ఇందులో నలుగురు మిత్రులు ఉంటారు. వీరికి మిగిలిన 96 మంది శత్రువులవుతారు. ఆ 96 మందిలో సైతం నలుగురితో కూడిన పలు టీంలు ఉంటాయి. వారికి 96 మంది శత్రువులుగా భావిస్తారు. అదే ఒక్కరు ఈ ఆటను ఆడితే.. మిగిలిన 99 మంది.. ఇద్దరు కలిసి ఆడితే మిగిలిన 98 మంది సభ్యులు వారికి శత్రువులు అవుతారు. ఎవరికి వారే బృందాలుగా ఏర్పడి ఐలాండ్‌లోకి దిగిన వెంటనే ఇళ్లలోకి చొరబడి లూటీలు చేస్తారు. ఈ ఆటను ఆడేందుకు కావాల్సిన పలు రకాల తుపాకీలు, స్కోప్స్, కారు, ద్విచక్రవాహనాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి వారు దోచుకుంటారు. ఈ క్రమంలో దాడి చేసిన వారిపై ప్రతి దాడులు చేసి వారిని హతమారుస్తారు. పలు ప్రదేశాల్లో ఉన్న శత్రువుల వద్దకు కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లి వారిని చంపుతారు. శత్రువులను సిగ్నళ్ల ద్వారా కనిపెడతారు. వెతికే క్రమంలో బ్లూ, వైట్ అనే రెండు సర్కిళ్లు ఉంటాయి. పొరపాటున బ్లూ సర్కిల్‌లోకి ప్రవేశిస్తే..వారు శక్తిని కోల్పోతారు. లేదా చనిపోయే ప్రమాదముంది. వైట్ సర్కిల్ సేఫ్ జోన్. ఆట మొత్తం మీద విమానం మూడుసార్లు ప్రవేశించి పలు రకాల తుపాకులు, స్కోప్స్, బాంబులు, బాణాలు జారవిడుస్తుంది. పబ్జి ఆటకు చాలామంది యువకులు బానిసలుగా మారి..కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిని బహిష్కరించాయి. ప్రత్యర్థులను ఎలా అంతమొందించాలి?, గెలవాలంటే ఎలాంటి తుపాకులను వినియోగించాలి? ఐలాండ్‌లో తిరిగేందుకు ఏ వాహనం ఎంచుకోవాలి? అని తరచూ ఆలోచిస్తూ మానసికంగా దెబ్బతింటున్నారు. ఆటలో ఇతరులను ఇష్టారీతిన చంపేస్తూ హింసాప్రవృత్తి పెంచుకోవడం బాధాకరం. ఈ ఆట ఆడేవారిలో చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. ఈ çపబ్జి భూతంతో అనేకమంది బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. ఇళ్లలో పెద్దలు దృష్టిసారించి..ఇలాంటి గేమ్స్ ఆడకుండా చూడాలని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆడితే హడలే.. బూర్గంపాడు: పబ్జి కార్పొరేషన్, బ్లూహోల్ సంస్థలు సృష్టించిన ఈ పబ్జి ఆటను ఆన్లైన్లో ఆడుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కాల్పులు, విధ్వంసం, హత్యలు వంటి ప్రక్రియలను ఓ గేమ్‌లోని చిన్న అంశంగా తీసిపారేస్తున్నారు. గతంలో ల్యాప్‌టాప్, కంప్యూటర్లకే పరిమితమైన ఈ ఆట ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో హల్చల్ చేస్తోంది. ఆటలో భాగంగా దాడులు, హత్యలు చేయడం వంటివి తొలుత సరదాగా అనిపించినా రానురానూ యువతలో, పిల్లల్లో మానసికంగా రాక్షసత్వాన్ని నింపుతున్నాయి. గంటల తరబడి ఈ గేమ్ నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. చదువులు, ఇతర వ్యాపకాలను పక్కకు పెట్టి కేవలం ఆన్లైన్ గేమ్స్‌కే కొందరు బానిసలుగా మారుతున్నారు. ఈ గేమ్ పిచ్చి బాగా ముదిరిన వారు..వింత చేష్టలతో మానసికంగా దెబ్బతింటున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించి, పిల్లలు స్మార్ట్ఫోన్లలో విపరీతమైన ఆటలు ఆడకుండా చూసుకోవాలి. నియంత్రించాలి.. ఆన్లైన్ గేమ్స్‌ను నియంత్రించకుంటే పిల్లల భవిష్యత్ ఇబ్బందుల పాలవుతుంది. ఆన్లైన్ గేమ్స్ వలన మానసిక పరిపక్వత మందగిస్తుంది. పిల్లలు ఈ ఆటలకు బానిసలైతే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఎక్కువవుతాయి. దీంతో వాళ్ల భవిష్యత్ పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉంచాలి. – డాక్టర్ శంకర్‌నాయక్, వైద్యనిపుణుడు -
తలకిందులు
ఎండాకాలమనే స్పృహ లేకుండా, మబ్బులన్నీ తలోమాటా అనేసుకొని రాత్రి చీకటిని మోసుకొచ్చాయి మధ్యాహ్నం పూటే. పది సంవత్సరాలైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగులోనే కూరుకుపోయిన మా శర్మ గాడికి, వాడి ఫ్రస్ట్రేషన్ చూపించుకోడానికి ఒక కారణం దొరికింది ఇవాళ. తెల్లని కాగితాల్లో, నల్లగా ఇరుక్కున్న మా జీవితాలను, ఎర్రగా ఖూనీ చేసి, ట్యూబ్ లైట్ వెలుతురులో, మాడిపోయిన మా మొహాలను చూసి కసిగా నవ్వుతూ, ఫస్ట్ ఇంటర్నల్ పేపర్స్ ఇస్తున్నాడు.ఈ ఏడు ఎలాగైనా గట్టెక్కేయాలని, వేణుగాడు మునుపెన్నడూ లేని విధంగా ముందు బెంచి పుస్తకాల కళ్లజోడులను సవరిస్తున్నాడు ఈ సెమిస్టరు మొదటి రోజు నుండే. ‘‘ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్’’ అనేది వాడి తీరు. సార్ పేపర్ ఇచ్చిందే తడవుగా, నిక్కర్కి పిర్రకాడ బొక్కపడితే చొక్కాతో కవర్ ఎలా చేసుకుంటామో, అలా ఆ ఆన్సర్ షీట్‌ని వెంటనే వాడు ఒక ముద్దలా చుట్టి బ్యాగ్‌లోకి దొబ్బాడు. క్లాస్ లో నక్కి ఉండే వీడు, బయట మాత్రం ఒక ‘ఫెరోసియస్’ విద్యార్థి నాయకుడు. మెస్‌లో మధ్యాహ్నం తిన్న తియ్యటి సాంబార్ కి నిద్రవస్తునట్టు ఉంటే, జీన్స్ ప్యాంటుకి బొక్క పడేంతగా తొడని మాటిమాటికీ గిచ్చుకుంటున్నా. నా నంబర్ పిలిచాడు అకస్మాత్తుగా. చివరిబెంచిలో కూర్చునే నా నల్లటి చెమట వాసనని ఎన్ని సార్లు పీలవలేదు, తలెత్తకుండానే నన్ను గుర్తు పట్టినట్టున్నట్టు, ముక్కును సవరించుకుంటున్నాడు. ఇందాక స్టూడెంట్ క్యాంటీన్లో సిగరెట్ తాగటం చూసాడనుకుంటా, మా ట్యూబ్ లైట్ నీడలు దగ్గరవుతున్నకొద్దీ చేతులు వింతగా ఆడిస్తున్నాడు, ఇంకా తగలబెట్టని పచ్చి శవం మీద వాలే ఈగలను అదిలిస్తున్నట్టు ‘‘షుడ్ ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్’’ అని గట్టిగా అరచి, ఎడంచేత్తో పేపర్ పారేసి, ఇంకా మిగిలిన గొర్రె పిల్లల మెడలు కొరకడానికి అందంగా నోరు తెరిచాడు. ‘‘ఖాతా ఐనా తెరిచావా?’’ అన్న వేణుగాడి వెకిలిచూపులకి సమాధానంగా, నా పేపర్ వాడి బల్లమీద వేసి, శర్మగాడు మిగిల్చిన పంటి గుర్తులను లోపలనుండి తడుముకుంటూ వెళ్లి కూర్చున్నా. రెండు గంటల విందు భోజనం తరువాత, తేన్చుకుంటూ, పొట్టమీద కుడిచేత్తో నిమురుకుంటూ వెళ్ళిపోయాడు.మళ్ళా క్యాంటీన్‌కి పోయినం, రెండు జేబుల్లో ఇంకొన్ని కబుర్లు నింపుకోవడానికి. గోధుమరంగు వేడి నీళ్ల పొగని, ఎండిపోయిన నారింజరంగు పెదాలతో తాగడం మొదలెట్టాను. బెంగాలీ ‘బోల్చి’ గాడి బీడీ ముద్దు పెట్టుకున్న ఘాటుకు, దగ్గొచ్చి, పొరలు పొరలుగా మాట్లాడుతుంటే, ఎందుకో నాన్న గుర్తుకు వచ్చాడు.పదో తరగతిలో అనుకుంటా, జెండాపండుగ ముందు రోజు ఇంటిబెల్లు ముందు పీరియడ్‌లో క్విజ్ పోటీ పెట్టారు. దానిలో మొదటి ప్రైజ్ వచ్చిందని నాన్నకి ఆ రాతిరి చెపుతుంటే, ‘‘మన రాష్ట్రానికి ఆర్థికశాఖ మంత్రి కూడా ఎవడో తెలియదరా, నా కొడకా?’’ అంటూ, జుట్టు పట్టుకొని, సారాయి ఘాటుని, నా మొఖంపై పిడికిలి గుర్తుగా విడిచిపెట్టాడు. ఆ రోజు ఈ ప్రశ్న ఒక్కటే మా గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేయనిది. ఫలితంగా, ఆ సంవత్సరం లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల పేర్లు, ఢిల్లీ మంత్రుల పేర్లు నోట్స్ అట్టల మీద, బచ్చల కాయల రసంతో రాసుకున్నా, ఎప్పటికి చెరిగిపోకూడదని.నేను ఫెయిల్ కావడమే ఇష్టం లేనివాడు, రీకోర్సు మీద రీకోర్సు చేస్తున్నాడు అని తెలిసి ఉంటే, ఏమి చేసి ఉండేవాడో ఇప్పుడు. పాపం, చనిపోయి బతికిపోయాడు. వేణుగాడు కూడా మాతో పాటే కూర్చున్నాడు. అసలు వాడి చుట్టూ ఎప్పుడూ, రసి కారే పుండు మీద గియ్యిన వాలే చిన్ని చిన్ని నల్ల దోమల్లాగా ఇద్దరు, ముగ్గురు, క్యాంపస్ సచ్చు రాజకీయ సొదని తగరపు శబ్దాల్లా మోగిస్తుంటారు. వీడేమో, పెంటకుప్పపై అక్కడక్కడా మొలిచే పిచ్చిమొక్కల్లా ఉన్న గడ్డాన్ని ఎడంచేత్తో బరుక్కుంటూ, మనుషుల పునాదుల్లో దాక్కున్న అమానుషత్వపు తెరలకు కారణం ఏమైఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నట్టు స్ఫురించేలా ఓ పనికిమాలిన పోజు పెట్టి, చెట్ల గుబుర్లోకి తీక్షణంగా చూస్తూన్నాడు.అటుగా వెళ్తున్న ‘నార్త్’ జూనియర్ వీడిని చూసి, ఒక మొహమాటపు నవ్వు తగిలించుకొని మావైపు వచ్చింది. వీడు కూడా, తెగిపడినట్టుండే కింద పెదవితో ఓ ‘నవ్వు’లాంటి శబ్దాన్ని చాలా కష్టంతో ‘సహజంగా’ వదిలాడు. అప్పుడు వాడి మొహం, మట్టి రోడ్డు మూల మలుపులో మెల్లగా నోరు తెరుచుకుని కాచుకునుండే రాళ్ళ బావిలాగా ఉంది.‘‘రేపు అడ్మినిస్ట్రేషన్‌లో నీ సర్టిఫికెట్స్ ప్రాబ్లమ్స్ నేనొచ్చి మాట్లాడతా’’ అని చెప్పి, ఇంకా తన మోచేతి నీళ్లు తాగి ఎంత మంది ఈ యూనివర్సిటీలో బతుకు లాగిస్తున్నారో అని ఓ లెక్కల చిట్టా విప్పాడు. ‘‘యూ ఆర్ ఏ కైండ్ పర్సన్’’ అన్న తన మాటలకి అడ్డుపడి, ‘‘యూ డోంట్ హ్యావ్ టు బీ థ్యాంక్ ఫుల్ టు మీ. ఐయామ్ డూయింగ్ వాట్ ఐయామ్ సపోజ్డ్ టూ డు’’ అని అన్నాడు. వాడి తీయని ఆ ఇంగ్లీష్ మాటలు, ఆ చేతి విరుపులు అచ్చం నీరుకట్ల పాము బుసలు కొడుతున్నట్టే. ఆ అమ్మాయి చేయి చాచి కృతజ్ఞత చెపుదామనుకుంటే, వీడేమో ఒక నమస్కారం పెట్టి తన ‘‘సంస్కారాన్ని’’ ప్రసవించాడు. ఈ శుక్రవారం ఏదో పండగ వచ్చి సెలవులు ఎక్కువగా వచ్చేసరికి, ఇంటికి పోవాలనుకున్నా, లోపల పేరుకున్న చెత్తైనా వదులుతుందేమో అని. రెండువందల కిలోమీటర్లని, ఐదు గంటల్లో తినేసిన ట్రైన్ ఇంజిన్ నన్ను మా మండలంలో విసర్జించింది. ఇంకొక ఆరు కిలోమీటర్లలో ఉన్న మా ఊరు పోవాలంటే, ఖాండ్రుఖాండ్రుమంటున్న ఆటోలే దిక్కు. రెండు గంటల కాలయాపన ఉక్కపోతల తరువాత, ఎనిమిది మంది అప్పీ ఆటోలో ఎక్కితే గాని, పోయినసారి ఎలెక్షన్ల హామీలకు గుర్తుగా మిగిలిన చిరుగులు రోడ్డు మీదకు టైర్లు కదలలేదు. కంకర కంటే గుంతలు ఎక్కువున్న రోడ్డు ఎగుడు దిగుడులకు, నెత్తి బొప్పికట్టకుండా, చెమట పట్టిన చేత్తో సైడ్ కడ్డీ పట్టుకొని,పైకి కిందకి జారుతున్నా.అరగంట తరువాత ఏదో జ్ఞాపకం వచ్చినట్టు బ్రేకు వేయగానే, యూనివర్సిటీ తాలూకా నిరాశను బ్యాగ్ లో పడేసి, చెప్పుల తపతపల్లో రేగిన జుట్టు గాయాలను సవరదిద్దుకుంటూ ఇంటికి నడిచినా.నాటుకు పొయ్యొచ్చి, పళ్ళు గట్టిగా బిగించి అరిగిపోయిన మోచిప్పలను చేత్తో కుదుపుతూ, ఇంకొక చేత్తో కొంగుకంటిన బురదని దులుపుకుంటుంది అమ్మ. శబ్దం చేయకుండా బ్యాగ్ ని మొత్తల్లో పడేసి, గాబుకాడికి పొయ్యా, మొఖానికి రాత్రి అంటిన రమ్ మరకలు ఎక్కడ అమ్మ చూసేస్తుందన్న భయంతో.కండవతో పైచెక్కులన్నీ వొలుచుకొని, ముసుగులన్నీ తుడుచుకున్న తరువాత, ప్లాస్టరింగ్ ఇంకా చేయని గోడకతికించిన అద్దంలో, అయిదేళ్ల క్రితం హైద్రాబాద్ పోయిన అప్పటి ‘నేను’ కనిపించాను. ఆ చీకట్లోనే నాకిష్టమైన చింత చిగురు దూసుకొచ్చి, ఉల్లిగడ్డలతో కలిపి వండి, కూర సట్టి ముందు పెట్టి, అంతవరకూ నా మీద పెట్టుకున్న ఆశలన్నీ పళ్లెంలో అన్నంలా తోడింది. హాస్టల్ కూరలు బాగోక, పచ్చడి కలుపుకున్న రాత్రులు తెచ్చిన అల్సర్ మంటలు అమ్మకి తెలియనీయకుండా, సగం వదిలేసిన ఆ అన్నం పెడ్డకి, ప్రయాణిక బడలిక కారణం అని అబద్ధం చెప్పా.ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ, మంచంలో పడుకున్న నా పక్కనొచ్చి కూర్చుంది. చిన్నప్పుడు ఆటల్లో తల్లో చిక్కుకున్న ఇసుకను తీస్తునట్టుగా, నా జుట్టులో వేళ్ళు కదుపుతూ– ఇటు చూడరా నీకొక మాట చెప్పాలనంది.‘‘చిన్నీ, నీ సావాసగాడికి కూడా మొన్న ఉద్యోగమొచ్చే. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. మరి నువ్వు కూడా ఇంగ ఎదో ఒకటి చూస్కో నీ పొట్టకి’’ అని, ఆ చీకట్లో వేడిగానున్న నా మూసివున్న కళ్ళను పదే పదే తడుముతుంది.పుల్లిగాడు, నేను పదోతరగతి వరకు క్లాస్‌మేట్లం. మా స్కూల్ సెకండ్ ర్యాంక్ వాడిని, టీటీసి దారుల్లోకి లాక్కొనిపోతే, నాకొచ్చిన మండల సెకండ్ ర్యాంక్, మా ఊర్లో డబ్బులున్న ఆసామి ‘దాతృత్వానికి’’ ఆకర్షించబడింది. ఆయన ‘చలువ చేత’, ఒక ప్రయివేటు ఇంటర్ కాలేజ్ ఇంగ్లిష్ మీడియం కోరలకు చిక్కుకొని, అత్యాచారానికి లోనయ్యా.రెండు సంవత్సరాల ర్యాంకుల కొలిమిలో కాల్చబడి తెచ్చుకున్న ఏఐయియియి, ఎంసెట్ సీట్లకు ఫీజుకట్టే స్తోమత లేక, బడి పండుగల్లో ‘‘ఆ పిల్లగాడి చదువు ఖర్చు మొత్తం మేమే భరిస్తున్నాం’’ అని బాకా ఊదిన కమ్మోరి సెల్ ఫోన్ కూడా బదులివ్వక, ఇదిగో ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో జాయిన్ అయ్యా. వాస్తవిక రొదలకి, ఆదర్శాల రొచ్చులకు మధ్యనున్న భూమికి, మూడు అడుగుల ఎత్తులో తొణుక్కుంటూ నడిచేదే యూనివర్సిటీ జీవితం. నిరసనలు, ఆత్మహత్యలు, హత్యలు, మానసిక అలజడులు, పుస్తకాల బూజులు, శారీరక దాడులు, సెక్సువల్ అసల్ట్లు, పుట్టుక నుండే మెదళ్లలో రుద్దే కొన్ని గజ్జి చీదర్లు, ఇవన్నీ వాటాలు వాటాలుగా స్టూడెంట్స్‌ని పంచుకుంటాయి కసికసిగా.జాయినైన మొదటి సంవత్సరంలో, నాది కాని ఈ రంగుల కల్చర్‌కి ఇమడలేక, లైబ్రరీ చెక్క కుర్చీల మధ్య రోజులంతా గడిపా. రెండో ఏడాది ఒకానొక రాత్రుల్లో, నిషా ఎక్కిన కళ్ళతో ‘విప్లవాల’ జోలపాటలకు బందీనై, తరువాత యేడు బాధిత పక్షాల నిరసనలకు, నేనెవరో తెలిసొచ్చి, కొత్త జెండా ఎత్తుకొని అరిచా, గొంతు బొంగురుపోయేదాకా. చివరకు, పోయినేడాది, సొంత జీవితపు ఎదుగుదలకు ఉద్యమాల రెక్కలనే విరిచేసిన ఈ క్యాంపస్ నాయకుల కపటత్వాన్ని చీదరించుకునేలోపే, యూనివర్సిటీ జీవితం ఒక అడుక్కి వచ్చిందనే సత్యం తెలిసొచ్చింది.పొద్దున్నే డొంకలోకి లోటాపట్టుకొని పోతుంటే, దారిలో ఎదురై, రెండు సంవత్సరాలు రికార్డులు రాయడానికి, ఇంకొక రెండేళ్లు కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ బిట్ల బరువులకి బలైపోయి, పీలగా వేలాడుతున్న చేతివేళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు పుల్లిగాడు. పెళ్లి చేసుకొని ఇక ‘పెద్దోళ్ల’ గుంపులో కలిసిపోతున్నాడని చెప్పి, ‘‘హైదరాబాద్‌లో చదువుతున్నావ్, మాలాగా కాకుండా పెద్ద జాబ్ నువ్వు కొట్టాలిరా’’ అని, ఉరుకులాంటి నడకతో సంసార జీవితంవైపు నడిచాడు.ఎంత దూరం చదువుకుంటుంటే, అంత పెద్ద ‘ఉజ్జోగం’ వస్తుందని మా వాళ్ళ లెక్క.ఇంకొక సెమిస్టరులో కోర్స్ అయిపోతుందనే ఊహకి, బయట నిరుద్యోగ పోటీలో నెగ్గుకురాగలమా అనే భయానికి మధ్య, ఎన్నో రోజులు డిప్రెస్సివ్ రాత్రులతో ఘర్షణ పడలేక ఇంటికి వస్తే, ఊరు పెట్టుకున్న ఆశలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దొడ్డికి పొయ్యెచ్చి బురదకాళ్లని కడుక్కుంటుంటే, ‘‘తుంటోడా.. తుంటోడా’’ అని అరుసుకుంటూ, ‘దానేల’ మాయ్య వచ్చిండు. మొఖం పుల్ల వేసుకొని వెళ్లి పక్కన సతికిలబడితే చెప్పుకుంటూ పోతున్నాడు– ‘‘ఏమి లేదురా, మన రవి గాడిని, నువ్వు చదివేకాడికి పరిచ్చ రాపిద్దామనుకుంటున్నా. అదేదో పెద్ద ఇనివెర్సిటీ అంట కద రా! పైగా నువున్నకాడ ఉంటే, నీకు మల్లె పయోజకుడు అవుతాడు. ఆ నెట్టిలో నువ్వే అప్పలయి చెయ్ మరి’’ అని గడ్డం పట్టుకున్నాడు. మాయ్యకి కొంచెం నత్తి. చెప్పలేనంత ప్రేమో, కోపమో వస్తే ఇలా చేతులకి, కాళ్ళకి పనిచెప్తూ ఉంటాడు. మాయ్య చిన్నకొడుకు రవిగాడు. మాయ్యకి అసలు ఇద్దరు కొడుకులున్నారని మొన్న రేషను కార్డు ఫోటోలు దిగిందాకా ఊళ్ళో వాళ్లకి తెలియదు. చిన్నప్పటి నుండి చదువు పిచ్చితో హాస్టల్లోనే పెరిగాడు వీడు. నేను ఏ సంగతయిందని మల్ల ఫోను చేసి చెప్తలే మాయ్య అని లోపలికెళ్ళి బ్యాగ్‌లో బట్టలు సర్దుకుంటున్నా.అప్పుడే బర్రెపాలు తెచ్చి టీ పెడ్తున్న అమ్మొచ్చి ‘‘ఏంది బిడ్డా, ఇంతలోకే పోతున్నావ్? ఇంటికాడ మనసు నిలవట్లేదా?’’ అని, నా పెద్ద గ్లాస్లో వేడి టీ పోసి ఇచ్చింది.అమ్మ కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పే ధైర్యం లేక, ఏదో అర్జెంటు క్లాస్ ఉందని మెస్సేజి వచ్చిందిలే అని బాగ్ లోపల తలదూర్చా, కన్నీళ్ళని ఆపుకోవడానికి. ఉతకని బట్టలమీద రెండు, మూడు కన్నీళ్ల చుక్కలు పడి, కంపు వాసన బయటకి రాబోతుంటే, గబ గబా జిప్ వేసేసాను.ఈసారెందుకో ఊరికి, యూనివర్సిటీకి మధ్య ఉన్న దూరం చాలా తక్కువనిపించింది. నిన్నటి నుండి ఒకటే నోరు పీకుతుంటే, ఒక సిగరెట్ ముట్టించా మెయిన్ గేట్ దగ్గర. పక్కనున్న యూకలిఫ్టస్ చెట్టుకి వేలాడుతున్న గబ్బిలానికి నేను ‘తలకిందులుగా’ కనిపిస్తున్నానేమో ఇప్పుడు.ఇంకొక సిగరెట్‌తో ఓ ఐదారు రోజుల ఆయుష్షు తగ్గించుకొని, హాస్టల్ వైపు బయల్దేరా. సెల్లార్లో మొన్న జాయినయిన జూనియర్ గాడు అటు ఇటు తిరుగుతున్నాడు. నన్ను చూసి దగ్గరకొచ్చి, ‘‘వేణన్నా, మా ఫ్రెండ్ నన్ను ఇక్కడ ఉండమని లోపలికెళ్లారు. రేపు ప్రొటెస్ట్ మీటింగ్ స్పీచ్ రాయాలి లైబ్రరీ కి పొయ్యి మేము ఇప్పుడు’’ అని, కలుషితం కానీ తన భావజాలాన్ని నాముందు పరచాడు.యూనివర్సిటీకి వచ్చిన రెండేళ్లలో వేణు గాడు నేర్చిన మాటలు గుర్తొచ్చాయి–ఏముందిరా, ఒంట్లో వేడి ఉన్నంతకాలం పోరాటం, ఆకలి, సమాజం అని మాటలు చెప్పి, వీలైనంత మందితో పక్కబట్టలమడతల్లో చలి కాచుకోవడమే. నాటకం అయిపోయిన తరువాత రంగు కడిగేసుకొని ఇక్కడ నుండి వీరుడిగా బయటకు పోవడమే మన పని.ఈ జూనియర్గాడి గురించి నాకెందుకులే అని లోపలికి పొయ్యి ఒక గంట తరువాత పని చేసుకొని బయటకు వచ్చినా, ఇంకా అక్కడే ఉండి బిక్కుబిక్కు మంటూ పెచ్చులూడిన గోడలను చూస్తున్నాడు. వీడిని చూస్తుంటే నాకు మా దానేల మాయ్య కొడుకు రవి గాడే గుర్తొచ్చాడు.సరిగ్గా అప్పుడే మాయ్య ఫోన్ చేస్తున్నాడు. కాల్ కట్ చేశా, ఒక నిశ్చయానికి వచ్చినట్టు. మేడి చైతన్య -
గుండె బ్యాంకులో వెలుగు నింపండి!
ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి!మీ గుండెలో ఏముంది?కష్టం నష్టం నిరాశ నిస్పృహమన రోజువారీ జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అది మనల్ని బాధకు గురిచేస్తూనే ఉంటుంది.కొప్పడతాం.తిట్టుకుంటాం.ఏమిటిదంతా అనుకుంటాం!అన్నీ గుండె బ్యాంకులో పడేస్తూ ఉంటాం.కష్టాన్నీ కన్నీళ్లనీ చిరాకుల్నీ పరాకుల్నీ... ఎన్నింటినో దాచుకుంటూ ఉంటాం. అందుకే మన గుండెలు కరడు గట్టిపోయాయి.అంతా కటిక చీకటి!ఓ దట్టమైన అరణ్యంలో ఓ గుహను ఊహించుకోండి. అందులో వందల ఏళ్లుగా చీకటి రాజ్యమేలుతుంటుంది. ఎటు చూసినా చిక్కటి చీకటి. నల్లటి చీకటి.అటుగా వెళ్లిన బాటసారి ఓ అగ్గిపుల్ల... ఒకే ఒక అగ్గిపుల్ల వెలిగించగానే చీకటి చెప్పాపెట్టకుండా పారిపోతుంది. అంతేతప్ప, ఏళ్లు గడిచింది కాబట్టి ఆ గుహలోకి వెలుగు తనంత తాను రాదు. మన గుండెలోని చీకటిని కూడా తొలగించుకోవాల్సింది మనమే. ఆ కాగడా ఏదైనా కావొచ్చు.అప్పుడు పూసిన వేపపువ్వో, వగరుగా ఉన్న మామిడిపిందో, తియ్యటి చెరుకుగడో, లేత చింతచిగురో, చిన్నకూతురి చిరునవ్వో, స్నేహితుడి ఆత్మీయ పలకరింపో, తాతయ్య చెప్పిన మంచిమాటో... ఏదైనా సరే.ఓ విషయం గమనించారా!ఇన్నాళ్లూ రాజ్యమేలాను అని చీకటి భీష్మించుకుని అది తన అధికారం అనుకుని మన గుండె గుహలో ఉండిపోదు. మీరు ఓ కాంతివంతమైన ఆలోచనను తలుచుకున్న మరుక్షణం అది మాయమైపోతుంది. అందుకే, మీ గుండె బ్యాంకులో ప్రతి రోజూ ప్రతి పూటా ఏదో ఒక చిరువెలుగునైనా దాచుకుంటూ ఉండండి. ఆ వెలుగే పెరిగి మీకు దారిచూపుతుంది. జీవితం పట్ల కొత్త ఆశ కలిగిస్తుంది. మీ ఎడిటర్ రామ్, ఫన్డే – ఫ్యామిలీ -
హోలీ అంటే చిరాకు
కరణ్ జోహార్ బాలీవుడ్ అగ్ర దర్శక– నిర్మాత. తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ తెరనిండా నటీనటులతో కలర్ఫుల్గా ఉంటాయి. కానీ కర ణ్‌కు మాత్రం కలర్‌ఫుల్ ఫెస్టివల్ ‘హోలీ’ అంటే చిరాకట. ఇంకో విశేషం ఏంటంటే దానికి కారణం అభిషేక్ బచ్చన్ అట. ఎందుకలా? అని అడిగితే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు కరణ్. ‘‘నా 7ఏళ్ల వయసప్పుడు అనుకుంటా.. ఓసారి హోలీకి మా వీధిలోని పిల్లలందరూ కలిసి నాకు రంగులు పూయటానికి వచ్చారు. ఆ రంగులు అంటకుండా ఉండటం కోసం వాళ్లకు దొరక్కుండా పరిగెత్తే ప్రయత్నంలో కిందపడిపోయాను. దెబ్బలు తగిలాయి. దాంతో వాళ్లతో గొడవ పడ్డాను. ఆ తర్వాత కొన్నేళ్లకు ఓ హోలీ రోజు అమితాబ్ బచ్చన్వాళ్ల ఇంటికి వెళ్లాను. నాకు హోలీ అంటే ఎందుకు భయమో అమిత్జీతో చెబుతున్నప్పుడు మా సంభాషణంతా వెనుక నుంచి అభిషేక్ బచ్చన్ విన్నాడు. మొత్తం విన్న తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అమాంతం ఎత్తుకొని రంగులున్న వాటర్ పూల్‌లో పడేశాడు. అంతే... అక్కడితో నాకు హోలీ అంటే చిరాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఎప్పూడు హోలీ ఆడలేదు’’ అని పేర్కొన్నారు కరణ్. -
మీడియాపై మాల్యా ఫ్రస్ట్రేషన్...
న్యూఢిల్లీ: రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యా మరోసారి ట్విట్టర్ వేదికగా తన ఉక్రోషాన్ని వెళ్ల గక్కారు. మీడియానే తనను దోషిగా చిత్రీకరించిందని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వ తీవ్ర చర్యల నేపథ్యంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా బాగా ఫ్రస్టేట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అటు సీబీఐ, ఇటు సెబీ తీవ్రంగా స్పందిండంతో మాల్యాకు చెమటలు పడుతున్నాయి. తాజాగా శుక్రవారం వరుస ట్వీట్లలో మీడియాపై దాడికి దిగారు. ఎలాంటి విచారణ లేకుండా తనను 'దోషిగా' చిత్రిస్తున్నారని మండిపడ్డారు. విస్తృతమైన ప్రభావంతో ఇలా చేస్తున్నాయన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాననడం వాస్తవం కాదన్నారు. అసలు తను ఎప్పుడూ అప్పులు తీసుకోలేదంటూ ట్వీట్ చేశారు. టీఆర్పీల కోసం వివాదాలను , గందరగోళాన్ని సృష్టించకుండా తెలివిగా, విచక్షణగా వ్యవహిరించాలన్న దేశాధ్యక్షుడి మాటలను కోట్ చేశారు. అలాగే సీబీఐ ఆరోపణలను కూడా మాల్యా మరోసారి తీవ్రంగా ఖండించారు. ఈ నిమిషం వరకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పులపై చట్టబద్ధమైన నిర్ధారణ ఏదీలేదని చెప్పొకొచ్చారు. విచారణ తర్వాత తన సామర్ధ్యం ఏమిటో తెలిసే అవకాశం ఉందన్నారు. అయితే మాల్యా లోన్ డిఫాల్ట్ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తన విచారణను మరింత పెడుతోంది. ఐడీబీఐ- కింగ్ ఫిషర్ కేసులోకి ఆర్థిక శాఖ మాజీ సీనియర్ అధికారులు , ప్రజప్రతినిధులు అలాగే సీనియర్ రాజకీయ నాయకులను విచారించినుట్టు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు వేల ఈమెయిల్స్ ను లోతుగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాల్యాకు అంత సులువుగా రుణాల కేటాయింపుపై కూపీ లాగుతున్న సంగతి తెలిసిందే. Yet it is reported that I have fled or run away owing money to Banks that I never ever borrowed in the first place. — Vijay Mallya (@TheVijayMallya) January 26, 2017 In our Country I assumed that innocence prevails till proven guilty. Media have convicted me guilty without trial with widespread influence — Vijay Mallya (@TheVijayMallya) January 26, 2017 -
'నా మానసిక ఆరోగ్యం బాగోలేదు'
వివాదాస్పద న్యాయమూర్తి కర్నన్ మరోసారి తెరపైకి వచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఆ నేపథ్యంలోనే తప్పుడు ఆర్డర్ పంపానని భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ జె.ఎస్ కెహర్, జస్టిస్ ఆర్.భానుమతికి తెలియజేశారు. కొందరు సహచర న్యాయమూర్తులు ఎగతాళి చేయడంతో మానసికంగా కుంగిపోయానని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్నన్ తెలిపారు. అయితే ఆ న్యాయమూర్తులు ఎవరన్న వివరాలను మాత్రం చెప్పలేదు. భవిష్యత్తులో తన వైఖరి సక్రమంగా ఉండేలా చూసుకుంటానని, అటువంటి తప్పులు తిరిగి జరగకుండా చూసుకుంటానని జస్టిస్ కర్నన్ తన లేఖలో హామీ ఇచ్చారు. తాను షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి కావడంతో ఇతర న్యాయమూర్తుల వేధింపులకు గురౌతున్నానని, కొన్ని సందర్భాల్లో తనను ఎగతాళి చేస్తున్నారని గతంలో ఆ విషయాన్నిసిజిఎఫ్ జాతీయ కమిషన్ ఛైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తాజా లేఖలో తెలిపారు. తనను వేధించిన జడ్జిల పేర్లను వెల్లడించలేదని, న్యాయవ్యవస్థలో కులతత్వాన్ని నిర్మూలించాలని, మత సామరస్యాన్ని కాపాడటంలో న్యాయవ్యవస్థ ముందుండాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్.. గతంలో జస్టిస్ కర్నన్ ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీచేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆ ఉత్తర్వులపై ఏకపక్షంగా స్పందిస్తూ తనకు తానే సుమోటోగా చర్యలు తీసుకుంటూ నిర్ణయం ప్రకటించుకున్న కర్నన్.. తనను బదిలీ చేయడానికి గల కారణాలను భారత ప్రధాన న్యాయమూర్తి ఫిబ్రవరి 15లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే మద్రాస్ హైకోర్ట్ విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 12న కర్నన్ జారీచేసిన అన్ని ఉత్తర్వులపైనా జస్టిస్ కెహర్ నేతృత్వంలోని బెంచ్ స్టే విధించింది. తిరిగి నోటీసులు అందేవరకూ కర్నన్ కు ఎటువంటి జ్యుడీషియల్ వర్క్ అప్పగించరాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలిచ్చారు. తర్వాత ఓసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ను జస్టిస్ కర్నన్ వ్యక్తిగతంగా కలిశారు. తాజాగా తన ప్రవర్తనకు గల కారణాలను వివరిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. -
వివాహిత ఆత్మహత్య
ఆదిలాబాద్: భర్త నెల క్రితం చనిపోయాడు. భర్త లేని ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. రెండు నెలల పసిపాపను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని తానూరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. తానూరుకు చెందిన మంజు (22)కు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్‌కు చెందిన యువకునితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. గతేడాది డిసెంబర్ 31న మంజు భర్త మృతి చెందాడు. దాంతో మంజు శిశువుతో కలసి వచ్చి తానూరులోని తల్లీదండ్రులు లాల, భారత్‌బాయి వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. (తానూర్) -
ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది
ధ్యాన భావనలు మనసు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి ఎన్నటికీ విశ్రాంతిగా గానీ, ప్రశాంతంగా గానీ ఉండలేడు. మనలో ద్వేష భావం ఉన్నదంటే, ఎవరో చేస్తున్న తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నామని! ఎవరైనా ఒక వ్యక్తి గానీ, ఏదైనా ఒక వస్తువు గానీ మనకు అశాంతిని కలుగజేస్తే, ముందు మనకు కలిగేది చిరాకు లేదా కోపం. ఈ చిరాకు, కోపం నిముషంలోనే ద్వేషంగా మారుతుంది. అయితే ఆ చిరాకు లేదా కోపం కాసేపే ఉంటుంది కానీ, వాటి నుంచి పుట్టిన ద్వేషం మాత్రం శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చుంటుంది మనసులో. అలా ఎందరి మీదో, ఎన్ని వస్తువుల మీదో, ఎన్ని పరిస్థితుల మీదో మనం ద్వేషం పెంచుకుంటూ పోతే మన మనసు పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ఎన్నటికీ దాని ఆరోగ్యం బాగుండదు. అంటే మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. అందువల్ల సాధకులుగా మనం ద్వేషాన్ని చిన్న సమస్యగా తీసి పారేయకూడదు. అది ఒక తీవ్రమైన, శాశ్వతమైన సమస్య. దాన్ని ప్రత్యేకంగా ఒక పట్టుపట్టాలి. అది కూడా చాలాకాలం పాటు. లేకపోతే ద్వేషం ఎన్నటికీ పోదు. ఏదో ఆషామాషీగా తీసిపారేయకూడదు. అతి ముఖ్యమైన అంశంగా చేసుకోవాలి. అసలు ద్వేషం ఎందుకు కలుగుతుంది? నాకు అశాంతి కానీ, అవస్థ గానీ కలిగితే తట్టుకోలేను కాబట్టి. అంటే మనసు బలహీనంగా ఉన్నట్టన్నమాట. బలహీనమైన మనసు ప్రతి చిన్నదానికీ రుసరుసలాడుతుంది. ద్వేషాన్ని పెంచుతుంది. ఈ ద్వేషాన్ని దరిచేరనీయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం మనసును దృఢపరచుకోవడం. శరీరానికి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? చికిత్స చేస్తాం. అది బాధాకరంగా ఉండొచ్చు. అంతమాత్రాన శరీరాన్ని ద్వేషించము. అలాగే కొంతమందితో కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. అందరినీ ఒకేలాగ చూడలేకపోవచ్చు. కానీ వాళ్ల మీద ద్వేషం పెంచుకోకుండా జాగ్రత్త పడాలి నేను. అంతేకాదు, వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ల ఉన్నతి కోసం, పరిణతి కోసం దేవుని ప్రార్థించాలి. నా మనసు దృఢంగా ఉంటేనే అది సాధ్యమౌతుంది. ప్రార్థన ద్వారా, నాకు నేను సూచనలు ఇచ్చుకోవడం ద్వారా నేను నా మనసుని దృఢపరచుకోగలను. ప్రతి ప్రార్థన ముగిశాక నేను మరింత దృఢం అయినట్లు భావిస్తాను. నేను మరింత దృఢంగా ఉన్నానని నాకు నేను చెప్పుకుంటాను. దేవుని కృప వల్ల, నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరినీ ద్వేషించను. కేవలం నాకు హాని చేయడమే తన జీవిత ధ్యేయంగా భావించే, నా అత్యంత భయంకరమైన శత్రువుని సైతం ద్వేషించను. ఆ శత్రువు పరిణతి చెందనందుకు అతని మీద జాలి పడతాను. అతని ఉన్నతి కోసం కూడా దేవుని ప్రార్థిస్తాను. అతని వల్ల నేను అవస్థ పడినప్పటికీ నేను అతన్ని ద్వేషించాలనేం లేదు. అతన్ని నేను ప్రేమించలేకపోవచ్చు. అలా ప్రేమించగలగడానికి మరింత శక్తి కావాలి కానీ, ముందుగా ద్వేషాన్నయితే మనసులోకి రానీయకూడదు. ఎప్పుడైతే మనసులో ద్వేషానికి చోటులేదో, అప్పుడు ప్రేమించడానికి అవకాశాలు మెరుగవుతాయి. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ) -
ఇంటి పోరు ఇంతింత కాదయా!
ఇల్లు కొంటే మొగుడు మొనగాడు అవుతాడని భార్య అనుకుంటుంది. ఉద్యోగిగా ఉన్న తాను బానిస అవుతానని భర్త అనుకుంటాడు. ఎందుకంటే ఇల్లు కొనడం ఒకప్పుడు జీవితంలో భాగం. ఇపుడు ఒక జీవిత లక్ష్యం. ఇక ఇంటికి పిల్లర్లు వేసేది బిల్డరు కాదు, ఇంటావిడ! ‘ఇప్పటి ఇల్లు’ ఒక మనిషి జీవితకాలపు శ్రమ. తాత్కాలిక ఆవాసం! చిత్రంగా ఉందా? కానీ, అదే నిజం. ఒకప్పుడు తాతలు ఇల్లు కట్టిస్తే మునిమనవడు కూడా అందులో ఏ ఇబ్బందీ లేకుండా నివాసం ఉండేవాడు. ఇపుడు ఒక తరంలో ఇల్లు రెండో తరంలో నివాసానికే కష్టమైపోతోంది. అద్దెకు మించిన మెయింటెనెన్స్ అవసరం అవుతోంది. సొంతింటి ఆనందం కంటే నిర్వహణ బాధే ఎక్కువ. ప్రతి భర్తకూ ఇల్లు కొనమని ఇద్దరు చెబుతారు... ఆ ఇద్దరు ఒకరు భార్య, ఇంకొకరు బ్యాంకు. ఇంట్లో ‘ఇంటి’ పోరు భలే చిత్రంగా మొదలవుతుంది. భార్యకు ఇల్లు సౌకర్యం అయితే, భర్తకు అది లగ్జరీ. ఎక్కడైనా ఇద్దరిదీ ఒకటే స్థాయి గాని ఇక్కడ మాత్రం కాదు. ఒక్కసారి శ్రీమతి గారికి సొంతిల్లు పైన మోజు కలిగితే ఇక అది రాచపుండులా ఎన్నాళ్లకీ మానదు. ఇక ఆమె దశదశలుగా ఇంటిని కొనడానికి భర్తను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో... మనకు తెలిసిన వారిలో, చుట్టాల్లో ఎవరెవరు ఇల్లు కొన్నారో భార్యామణి ద్వారా మన చెవులకు వద్దన్నా తాకుతుంటుంది. రెండో దశలో... ఇల్లు కొన్న వాళ్లు ఎంతెంత సుఖంగా ఉన్నారో, ఇల్లు కొనడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తప్పిపోయాయో ఆమె ఒక డైలీ సీరియల్ అంత అందంగా చెబుతూ ఉంటుంది. మూడో దశలో... సొంతిల్లు లేకపోవడం వల్ల ఓనరు పెట్టే ఆంక్షలు, ఇల్లు మారినపుడు వెతకడానికి పోతే నచ్చింది వెంటనే దొరకక, బడ్జెట్లో దొరక్క ఇల్లు మారినపుడల్లా కాస్త లిమిట్ పెంచుకుని ఇంటికోసం ఎక్కువ అద్దెను బాధగా కడుతున్నపుడు ‘చూశావా మనమే ఓ ఫ్లాటు కొనుక్కుని ఉంటే ఎంత బాగుండేది ఊరికే ఇంతింత అద్దె కడుతున్నాం’.. అని ప్రతి నెలా చురకలు, వేధింపులు, మాటల తూటాలు తగులుతూ ఉంటాయి. అపుడు సెగ మొదలవుతుంది. ఆ సెగకు తోడు ప్రతి ఒక్కడు ‘మీరుంటున్న ఇంటిపై మీ పేరు మీద కరెంటు బిల్లు, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు ఉందా?’ అని అడిగినపుడు... ఒరే అవన్నీ ఎలా ఉంటాయిరా అని గట్టిగా అరవాలనిపించిన ఫ్రస్ట్రేషన్లో కూడా భార్య సలహా గుర్తొస్తుంటుంది. ఎందుకంటే సొంతిల్లుంటే ఈ బాధలుండవు కదా అని అనిపిస్తుంది. కానీ, వెంటనే బ్యాంకు వాడు, వాడు కట్టే వడ్డీ లెక్కలు తలచుకుంటే మొత్తం మటాష్! ఇక నాలుగో దశ... పూర్వీకులు ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పారు... బాగానే ఉంది, భార్య ‘ఇల్లు భర్త లక్షణం’ అంటుంది. ఉద్యోగం అయితే టాలెంటుతో వచ్చేది కాబట్టి కిందా మీద పడి ఏదో సాధించుకోవచ్చు. మరి ఇంటి పరిస్థితి ఏంటి... ఐటీ ఉద్యోగిని పక్కనపెడితే సగటు జీవికి ఇల్లు ఒక అందని ద్రాక్ష. ఎన్నో స్ఫూర్తి కథలు విన్నాక ఇల్లు కొనాలని ఇన్స్పైర్ అయ్యి బ్యాంకుకు వెళితే ఒక విషయం అర్థమవుతుంది. బ్యాంకు వాడు తాకట్టు పెట్టుకునేది ఆ కొన్న ఇంటిని కాదు, మన జీవితాన్ని అని. మనిషన్నాక కష్టాలుండవా? జీవితమన్నాక ఒడుదొడుకులుండవా ? అంటే ఒప్పుకోడు నీవేమైనా చేసుకో ఇల్లు కావాలంటే ఇరవై ఏళ్లు లక్షకు వెయ్యి కట్టమంటాడు. ఊరికి దూ...ర...ం....గా... పోయి ఇంతకాలం దాచుకున్నది ఏమైనా ఉంటే దాన్నంతా పెట్టేసి, మరో పదిహేను లక్షల కోసం బ్యాంకు వాడికి ఇంటి రూపంలో మన జీవితాన్ని తాకట్టు పెడితే 20 ఏళ్ల పాటు నెలనెలా ఠంచనుగా తీసుకుంటూనే ఉంటాడు. ఎంత చమత్కారమంటే... ముందు వడ్డీ అంతా లెక్కకట్టి దాన్ని వసూలు చేసి ఆ తర్వాత అసలు తీసుకుంటాడు. ఇక భార్య, బ్యాంకు హ్యాపీ... ఇల్లు కొననంత వరకు ఇల్లే లగ్జరీ, ఇల్లు కొన్నాక సినిమా కూడా లగ్జరీ అయిపోతుంది. ఉద్యోగం అయితే టాలెంటుతో వచ్చేది కాబట్టి కిందా మీద పడి ఏదో సాధించుకోవచ్చు. మరి ఇంటి పరిస్థితి ఏంటి... ఐటీ ఉద్యోగిని పక్కనపెడితే సగటు జీవికి ఇల్లు ఒక అందని ద్రాక్ష.