Watch: Kid Frustrated When Asked To Do Homework, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: ‘మై దునియా సే నికల్‌ జావూంగా​‍’.. పిల్లాడి హోమ్‌ వర్క్‌ ఫ్రస్ట్రేషన్‌ చూడండి!

Published Mon, Aug 1 2022 7:39 PM | Last Updated on Mon, Aug 1 2022 8:21 PM

In A Viral Video A Boy Frustrated When Asked To Do Homework - Sakshi

న్యూఢిల్లీ: స్కూల్‌ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలని భావిస్తారు పిల్లలు. కానీ, ఇంటికి రాగానే హోమ్‌వర్క్‌ చేయమంటే నిరాశకు లోనవుతారు. అయిష్టంగానే పుస్తకాలు తెరుస్తారు. కొందరైతే.. కోపంతో నేను చేయను పో అని తెగేసి చెప్తారు. ఆ కోవకే చెందుతాడు ఈ పిల్లాడు. హోమ్‌ వర్క్‌ చేయమన్న తన తల్లిపైనే అసహనం వ్యక్తం చేశాడు. ఆ బుజ్జాయి మాటలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.   

వీడియోలో.. హిందీ నోట్‌బుక్‌ను తెరిచిన పిల్లాడు తన తల్లికి ఎదురు సమాధానమిస్తున్నాడు. హోమ్‌వర్క్‌ చేయలేక తాను ఈ లోకం నుంచి వెళ్లాలనుకుంటున్నాని షాక్‌ ఇచ్చాడు. ‘మమ్మీ నేను పరేషాన్‌ అవుతున్న. అసుల ఈ దినియాలోకి ఎందుకు వచ్చాను. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాను, వెళ్లిపోతాను.’ అంటూ తన పెన్సిల్‌ను పదే పదే పుస్తకంపై బాదుతూ చెప్పాడు. ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని అతడి తల్లి అడగగా.. నాకు ఈ ప్రపంచంలో ఉండాలని లేదు, నువ్‌ అందంగా లేవు అని సమాధానమిచ్చాడు. దానికి ఆమె పడిపడి నవ్వసాగింది. ఆ వీడియోను ఎమోబోయిస్‌ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. హోమ్‌ వర్క్‌ చేయమంటే ఏం జరుగుతుందో చూడండి అంటూ రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్‌...టచ్‌ చేయకూడనవి టచ్‌ చేస్తే ఇలానే ఉంటుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement