
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన కోపాన్ని మరోసారి ప్రదర్శించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రెయిగ్ ఓవర్టన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. కోహ్లి మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాననే బాధతో పెవిలియన్ చేరాడు.
చదవండి: Ajinkya Rahane: రహానే ఎందుకిలా.. అభిమానుల ఆగ్రహం
ఈ క్రమంలోనే డ్రెస్సింగ్‌రూమ్‌కు వస్తూ కోపంతో గ్లోవ్స్‌తోనే గోడను బలంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అసలే కోహ్లి సెంచరీ చేయక రెండేళ్లు అవుతుంది. అర్థసెంచరీలు చేస్తున్నప్పటికీ దానిని సెంచరీలుగా మలచలేకపోతున్నానే బాధ తాజా చర్యతో కోహ్లి మొహంలో స్పష్టంగా కనిపించింది. ఇక మ్యాచ్‌లో టీమిండియా 271 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 36, శార్దూల్ ఠాకూర్ 32 పరుగులతో ఆడుతున్నారు.
చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా పాజిటివ్
Virat Kohli is frustrated of his dismissal.#ENGvIND pic.twitter.com/YifSoc9UEe
— Mr.Cricket (@MrCricketR) September 5, 2021