సిడ్నీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా బెస్ట్ టీమ్‌ను చూశానంటూ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పేర్కొన్నాడు. కాగా కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దుపై ఈసీబీ నిర్ణయాన్ని సమర్థించిన మాజీ క్రికెటర్లలో షేన్ వార్న్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా వార్న్ టీమిండియా ప్రదర్శనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి:టీమిండియాను ట్రోల్ చేసిన వాన్.. పీటర్సన్ కౌంటర్
''టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ రద్దవడం కాస్త ఆశ్చర్యపరిచింది. కానీ నష్టం జరగకముందే ఈసీబీ, బీసీసీఐ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవడం సంతోషించాల్సిన విషయం. ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఉండగా ఆటగాళ్లకు కరోనా సోకి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆ ప్రభావం ఐపీఎల్ సీజన్‌పై పడి ఉండేది. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతం. వారు క్రికెట్ ఆడిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. ఇంగ్లండ్ గడ్డ నుంచి టీమిండియా వెళుతూ వెళుతూ.. సిరీస్ ఆధిక్యంతో పాటు నా టోపీని ఎత్తుకెళ్లారు. టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశపెట్టినప్పటి నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. టేబుల్‌లో టాప్ స్థానంలో ఉండేదుకు ఇరు జట్లు మంచి పోటీతో క్రికెట్ ఆడాయి. అయితే టీమిండియా తన అద్భుత ఆటతీరుతో 2-1 తేడాతో సిరీస్ గెలిచి ఆధిక్యంలో ఉంది. టీమిండియా ఇంగ్లండ్‌ను వారి గడ్డపై ఓడించాలనుకుంది. డ్యూక్స్, స్వింగ్, సీమింగ్ బంతులతో ఫలితం రాబట్టింది. అని చెప్పుకొచ్చాడు.
నిర్ణయాత్మకమైన ఐదో టెస్టు కోవిడ్ కారణంగా రద్దు కావడంతో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో విజేత ఎవరనేది తేల్చలేదు. అయితే వచ్చే ఏడాది జూలైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(పరిమిత ఓవర్ల క్రికెట్) నేపథ్యంలో అప్పుడు ఈ టెస్టు మ్యాచ్ నిర్వహించేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 22న సౌరవ్ గంగూలీ టెస్టు మ్యాచ్ నిర్వహణపై లండన్‌కు బయలుదేరి వెళ్లనున్నాడు. ఆ ఫలితం ఆధారంగానే సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Sunil Gavaskar: నాడు ఇంగ్లండ్ చేసిన పనిని మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..!
Comments
Please login to add a commentAdd a comment