
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం టీమిండియా 54 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 62, పుజారా 39 పరుగులతో ఆడుతున్నారు.
ఈ విషయం పక్కన పెడితే రోహిత్ శర్మ చతేశ్వర్ పుజారాపై అసహనం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. క్రిస్ వోక్స్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని పుజారా మిడాఫ్ దిశగా ఆడాడు. ఈ సమయంలో పుజారా రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే రోహిత్ సింగిల్‌కే మొగ్గు చూపాడు. పుజారా అది పట్టించుకోకుండా రెండో పరుగు కోసం క్రీజు దాటేశాడు. దీంతో రోహిత్ పుజారా వైపు తిరిగి ''సింగిల్ చాలు అన్నానుగా.. మళ్లీ ఎందుకు పరిగెత్తుతున్నావు'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment