వెస్టిండీస్‌తో మొదలైన తొలి టెస్టులో తొలిరోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట తొలిరోజు విండీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది.
రెండోరోజు మొత్తం బ్యాటింగ్ చేసే అవకాశం ఉన్న టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశముంది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసేపోయేలా కనిపిస్తోంది. అంతకముందు టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది.
విండీస్ బ్యాటర్లలో అలిక్ అతానజే 47 పరుగులు మినహా మిగతావారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయకుండానే విండీస్ బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. జడేజా మూడు వికెట్లు, సిరాజ్, శార్దూల్‌లు చెరొక వికెట్ తీశారు.
చదవండి: విండీస్ బ్యాటర్లకు చుక్కలు.. చెలరేగిన అశ్విన్.. కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment