పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ప్రతిఘటిస్తోంది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా కాస్త నిలకడైన బ్యాటింగ్ కనబరిచిన విండీస్ బ్యాటర్ల వికెట్లు తీయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. రోజంతా కలిపి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. దీనికి తోడు వర్షం అంతరాయం కలిగించడం.. సరైన వెలుతురులేమి కారణంగా ఆటను అరగంట ముందే నిలిపివేశారు.
ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు ఇంకా 209 పరుగుల వెనుకబడి ఉంది. క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్ (37) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక నాలుగో రోజు ఆట అరంగంట ముందుగానే మొదలుకానుంది.
ఇక తొలి సెషన్‌లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, విండీస్ 31 పరుగులు చేసి కిర్క్ మెకన్జీ (57 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మెకన్జీని భారత్ తరఫున అరంగేట్రం చేసిన ముకేశ్ కుమార్ తన తొలి వికెట్‌గా పెవిలియన్ పంపించడం విశేషం. ముకేశ్ వేసిన బంతిని ఆడలేక మెకన్జీ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెకన్జీ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.
ఉనాద్కట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను అశ్విన్ బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా సిక్స్ బాదాడు. లంచ్ విరామ సమయానికి బ్రాత్‌వైట్ 49 పరుగుల వద్ద ఉన్నాడు. రెండో సెషన్ ప్రారంభం కాగానే బ్రాత్‌వైట్ 170 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే సెషన్‌లో అతని వికెట్ తీయడంలో భారత్ సఫలమైంది.
అశ్విన్ వేసిన చక్కటి బంతి బ్రాత్‌వైట్ మిడిల్ స్టంప్‌ను తాకింది. ఆ తర్వాత బ్లాక్‌వుడ్, అతనజ్ కలిసి జట్టును నడిపించారు. మరో 13.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమిండియా ఈ జోడీని విడదీయడంలో విఫలమైంది. రెండు రివ్యూలు కూడా భారత్‌కు ప్రతికూలంగా వచ్చాయి.
చదవండి: #MLC2023: ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. ఎవరీ సౌరబ్ నేత్రావల్కర్?
Comments
Please login to add a commentAdd a comment