Ravindra Jadeja Clean Bowled Frustated Try To Hit Stumps.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో మెరవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేసింది. అయితే న్యూజిలాండ్ ధీటుగా బదులిస్తుంది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చదవండి: Trolls On Wriddhiman Saha: ఏం ఆడుతున్నావయ్యా బాబూ.. ఇకనైనా భరత్‌ను తీసుకుంటారా?
ఇక విషయంలోకి వెళితే.. హాఫ్ సెంచరీతో మెరిసిన రవీంద్ర జడేజా అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. అయితే అతను ఔటైన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిమ్ సౌథీ బ్యూటీ బౌలింగ్‌కు జడేజా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ 86వ ఓవర్‌లో సౌథీ చివరి బంతి వేయగా.. జడేజా ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు. కాగా బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దీంతో జడేజా కోపంతో బ్యాట్‌ను వికెట్లను కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎందుకో మళ్లీ వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత పెవిలియన్ వెళుతూ తనను తాను తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ షేర్ చేసింది.
https://www.bcci.tv/videos/156936/ind-vs-nz-2021-1st-test-day-2-ravindra-jadeja-wicket
Comments
Please login to add a commentAdd a comment