
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన స్టీవ్ స్మిత్ తన చర్యతో సిరాజ్‌కు కోపం తెప్పించాడు. రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఇది జరిగింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 86వ ఓవర్‌లో మూడో బంతి వేయడానికి సిరాజ్ సిద్దమయ్యాడు.
రనప్ తీసుకొని బంతి విడవడానికి ముందు స్మిత్ క్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇది సిరాజ్‌కు చిరాకు తెప్పించింది. వెంటనే బంతిని స్మిత్ వైపు కోపంగా విసిరాడు. స్మిత్ చర్యకు కెప్టెన్ రోహిత్ కూడా షాక్ తిన్నాడు.అయితే గ్రౌండ్‌లోని స్పైడర్ కెమెరా అడ్డు రావడంతోనే అలా చేసినట్లు స్మిత్ వివరణ ఇచ్చినప్పటికి సిరాజ్ పట్టించుకోలేదు. నేను రనప్ తీసుకోకముందే ఆపి ఉంటే బాగుండేది కదా అంటూ కోపంతో పేర్కొన్నాడు.
అయితే ఇద్దరు సైలెంట్ కావడంతో ఎలాంటి మాటల యుద్దం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో రోజు మొదలైన కాసేపటికే సిరాజ్ బౌలింగ్‌లోనే రెండు వరుస బౌండరీలు బాది టెస్టుల్లో 31వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా స్మిత్‌కు టీమిండియాపై టెస్టుల్లో ఇది తొమ్మిదో సెంచరీ. ఇక 121 పరుగులు చేసిన అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో స్మిత్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
Siraj is the most dislikeable Cricketer i've ever seen.pic.twitter.com/3aGCxXDEyF
— ` (@rahulmsd_91) June 8, 2023
చదవండి: #SteveSmith: టీమిండియాకు కొరకరాని కొయ్య.. ఔట్ చేయడం చాలా కష్టం