టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా నాథన్ లియాన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా సిరాజ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లతో మెరిశాడు.
కాగా 19 టెస్టుల్లో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా టీమిండియా తరపున టెస్టుల్లో 50 వికెట్లు తీసిన 42వ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇక టీమిండియా తరపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా 11 టెస్టుల్లోనే 50 వికెట్ల మార్క్ అందుకున్నాడు.
కాగా సిరాజ్‌కు టెస్టుల్లో స్వదేశం కంటే విదేశాల్లోనే మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తీసిన 50 వికెట్లలో 41 వికెట్లు విదేశాల్లో వచ్చినవే. ఇందులో 18 వికెట్లు(ఏడు టెస్టుల్లో) ఆస్ట్రేలియా గడ్డపై, 20 వికెట్లు(ఆరు టెస్టుల్లో) ఇంగ్లండ్ గడ్డపై తీశాడు. ఇక సిరాజ్ ఖాతాలో ఒకే ఒక్క ఐదు వికెట్ల హాల్ ఉండగా.. అది కూడా ఆసీస్ గడ్డపైనే(2021లో బ్రిస్బేన్‌లో) వచ్చింది.
Mohammed Siraj completes 5️⃣0️⃣ Test wickets in just 19 Test matches.
— CricTracker (@Cricketracker) June 8, 2023
One of the most improved players in recent times.@mdsirajofficial | #WTC2023Final pic.twitter.com/nwE4lhS6pW
Comments
Please login to add a commentAdd a comment