
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అల్లాడిపోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అంతకముందు ఓవర్లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్ మంచి జోరు మీద ఉన్నాడు. ఖవాజా ఔట్ కాగానే క్రీజులోకి వచ్చిన లబుషేన్ కుదురుకునే ప్రయత్నం చేశాడు.
కాగా 8వ ఓవర్ తొలి బంతిని సిరాజ్ 143 కిమీ వేగంతో విసిరాడు. బంతి నేరుగా వచ్చి లబుషేన్ ఎడమ బొటనవేలిని తాకుతూ వెళ్లింది. దీంతో బ్యాట్‌ను కిందపడేసిన లబుషేన్ నొప్పితో అల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి పరిశీలించిన అనంతరం లబుషేన్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Raju88 (@Raju88784482906) June 7, 2023
చదవండి: WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు?