
అడిలైడ్ వేదికగా భారత్‌తో మొదలైన పింక్‌బాల్ టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఆసీస్ జట్టు 88 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌పై బంతిని విసిరాడు.
అసలేం జరిగిందంటే?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో 5వ బంతిని వేసేందుకు సిరాజ్ సిద్దమయ్యాడు. స్ట్రైక్‌లో మార్నస్ లబుషేన్ ఉన్నాడు. అయితే సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు బీర్ స్నేక్(ఖాళీ బీర్ ప్లాస్టిక్ కప్పులు) తీసుకుని నడవడంతో ఏకాగ్రత కోల్పోయిన లబుషేన్ ఆఖరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు.
దీంతో బంతిని వేసేందుకు రనప్‌తో వేగంగా వచ్చిన సిరాజ్ కూడా మధ్యలో ఆగిపోయాడు. అయితే సిరాజ్ తన బౌలింగ్‌ను ఆఖరి నిమిషంలో అపినప్పటికి.. ప్రత్యర్ధి బ్యాటర్‌పై కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సహానం కోల్పోయిన సిరాజ్ బంతిని లబుషేన్ వైపు త్రో చేశాడు. లబుషేన్ అలా చూస్తూ ఉండిపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిని ఆసీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. భారత అభిమానులు సైతం అతడి చర్యలను తప్పుబడుతున్నారు. సిరాజ్ మియా అంత దూకుడెందుకు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
Mohammed Siraj was not too pleased with this 😂#AUSvIND pic.twitter.com/1QQEI5NE2g
— cricket.com.au (@cricketcomau) December 6, 2024