ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పోరాడుతోంది. ఆసీస్ ఇప్పటికే 330 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకు ఓటమి ముప్పు పొంచే ఉంది. మరో గంటలో ముగిసే తొలి సెషన్‌లోపూ ఆసీస్‌ను ఆలౌట్ చేయకుంటే టీమిండియాకు పెను ప్రమాదం ఉంది. 400 పరుగులకు పైగా టార్గెట్‌ను నిర్దేశించే పనిలో ఉన్న ఆసీస్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గ్రీన్ 25, అలెక్స్ కేరీ 22 పరుగులతో ఆడుతున్నారు.
ఈ విషయం పక్కనబెడితే.. నాలుగోరోజు ఆట మొదలైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్నస్ లబుషేన్‌ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన బంతి లబుషేన్ బ్యాట్‌కు తగులుతూ నేరుగా పుజారా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అయితే లబుషేన్ ఔట్ చేసిన ఆనందంలో ఉమేశ్ యాదవ్ గట్టిగా అరుస్తూ కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు.
అయితే ఉమేశ్ ఇలా చేయడం వెనుక ఒక కారణముందని అభిమానులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఉమేశ్ ఇవేవి పట్టించుకోకుండా కేవలం తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న ఉమేశ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియారిటీ ఎప్పటికైనా పనికొచ్చేది కాని వ్యర్థం కాదు అని నిరూపించాడు. అందుకే లబుషేన్ వికెట్ తీయగానే అంత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment