
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటకి బౌలర్లు మాత్రం అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారత ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు కంగారు బ్యాటర్లు విల్లవిల్లాడారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో అత్యధికంగా జోష్ హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్-లబుషేన్ డిష్యూం.. డిష్యూం
ఇక మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన సిరాజ్ మూడో బంతిని మార్నస్‌కు షార్ట్ బాల్‌గా సంధించాడు. అయితే ఆ బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడటానికి సదరు బ్యాటర్ ప్రయత్నించాడు.
కానీ బంతి అతడి బ్యాట్‌కు కాకుండా తొడ ప్యాడ్ తాకి స్టంప్స్ దగ్గరలో పడింది. అయితే లబుషేన్ మాత్రం బంతిని చూడకుండా పరుగుకోసం ప్రయత్నించాడు. వెంటనే బంతి క్రీజు వద్దే ఉందని గమనించిన లబుషేన్ పరుగును ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ఫాల్ త్రూలో వేగంగా క్రీజు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి రనౌట్ చేయాలనకున్నాడు.
కానీ లబుషేన్ మాత్రం సిరాజ్ రనౌట్ చేస్తాడనే భయంతో బంతిని తన బ్యాట్‌తో పక్కకు నెట్టాడు. అయితే లబుషేన్ బంతిని పక్కకు నెట్టేటప్పుడు క్రీజులో లేడు. దీంతో సదరు ఆసీస్ బ్యాటర్ అలా చేయడం సిరాజ్‌కు కోపం తెప్పించింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి సిరాజ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. అంతలోనే విరాట్ కోహ్లి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టాడు.
కానీ లబుషేన్ అప్పటికే క్రీజులో ఉన్నాడు. కానీ కోహ్లి మాత్రం అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కావాలనే అలా చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది డీఎస్పీ బ్రో.. జాగ్రత్తగా ఉండాలంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi
— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024