న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం | South Africa beat New Zealand by 7 wickets | Sakshi
Sakshi News home page

NZ vs SA: న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

Mar 15 2026 2:34 PM | Updated on Mar 15 2026 3:56 PM

South Africa beat New Zealand by 7 wickets

న్యూజిలాండ్‌ పర్యటనను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రోటీస్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

మార్‌క్రమ్‌, డికాక్‌, రబాడ, ఎంగిడి వంటి సీనియర్లు లేనిప్పటికి.. కేశవ్‌ మహారాజ్‌ సారథ్యంలో ప్రోటీస్‌ యువ జట్టు అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్ల దాటికి కివీస్‌ బ్యాటర్లు విల్లవిల్లాడారు. 

కివీస్‌ బ్యాటర్లలో నీషమ్‌(26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్‌ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్‌మన్‌, కేశవ్‌ మహారాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

అనంతరం 92 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కూడా తీవ్రంగా శ్రమించింది. కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ సఫారీలను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ఓపెనర్ కానర్ ఎస్టర్‌హైజెన్(45) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. ఫలితంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 హామిల్టన్ వేదికగా మార్చి 17న జరగనుంది.
చదవండి: మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement