వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా ముంగిట అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఇంతకముందు జరిగిన రెండు వన్డేల్లోనూ 300 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తొలి వన్డేలో 308 పరుగులను కాపాడుకునే క్రమంలో మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో 312 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మిగిలి ఉండగా విజయం సాధించింది.
ఇక బుధవారం జరగనున్న మూడో వన్డేలో గనుక టీమిండియా విజయం సాధిస్తే పలు రికార్డులు అందుకోనుంది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.
►మూడో వన్డేలో టీమిండియా గెలిస్తే.. విండీస్‌ను వారి సొంతగడ్డపైనే వైట్‌వాష్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించనుంది.
►మూడో వన్డే విజయంతో కరీబియన్ గడ్డపై తొలిసారి టీమిండియా క్లీన్‌స్వీప్‌తో సిరీస్ గెలవనున్న జట్టుగా నిలవనుంది.
►ఒకవేళ విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు ఇది 13వ సిరీస్ క్లీన్‌స్వీప్ సిరీస్ విజయం కానుంది.
►విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే విదేశీ గడ్డపై టీమిండియాకు ఇది మూడో క్లీన్‌స్వీప్ సిరీస్ అవుతుంది.
►ఇంతకముందు 2103, 2015, 2016లో జింబాబ్వేను.. 2017లో శ్రీలంకను టీమిండియా వైట్‌వాష్ చేసింది.
►ఇక విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ఒకే క్యాలండర్ ఇయర్‌లో డబుల్ వైట్‌వాష్ చేసిన మూడో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ 3-0తో వైట్‌వాష్ అయింది.
►ఒక జట్టు ఒకే క్యాలండర్ ఇయర్‌లో తన ప్రత్యర్థిని డబుల్ వైట్‌వాష్ చేసిన సందర్భాలు రెండుసార్లు మాత్రమే. 2001లో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపైనే 4-0తో వైట్‌వాష్ చేయగా.. అదే ఏడాది కెన్యా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో డబుల్ వైట్‌వాష్ చేసింది.ఇక 2006లో బంగ్లాదేశ్ ఇంటా, బయటా రెండుసార్లు 3-0తో కెన్యాను క్లీన్‌స్వీప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment