కరోనా నుంచి కోలుకొని వెస్టిండీస్‌తో మూడో వన్డేలో ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ అంతగా ఆకట్టుకోలేదు. 26 బంతులెదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా విశేషంగా రాణించిన ధావన్ అదే ఫామ్‌ను విండీస్‌తో మ్యాచ్‌లో కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. 10 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క సిక్సర్ ఉంది. అయితే ధావన్ 14 డాట్ బంతులు ఆడిన తర్వాత గానీ ఆ సిక్సర్ రావడం విశేషం. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ దిశగా స్టన్నింగ్ సిక్స్ ఆడాడు. అయితే ఆ కాసేపటికే ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్లలో 265 పరుగులుకు ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. రిషబ్ పంత్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో దీపక్ చహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33 పరుగులు చేయడంతో టీమిండియా 250 ప్లస్ స్కోరు దాటింది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4, అల్జారీ జోసెఫ్, హెడెన్ వాల్ష్ చెరో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్, ఫాబియెన్ అలెన్ తలా ఒక వికెట తీశారు.
Comments
Please login to add a commentAdd a comment