సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. సూపర్‌మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ! | Sheldon Jackson flies to his right to take a Stunning catch vs RCB | Sakshi
Sakshi News home page

IPL 2022: వార్వెవా జాక్సన్‌.. సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌.. సూపర్‌మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ!

Published Thu, Mar 31 2022 5:38 PM | Last Updated on Thu, Mar 31 2022 9:14 PM

Sheldon Jackson flies to his right to take a Stunning catch vs RCB - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ వికెట్‌ కీపర్‌ షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో..  రెండో బంతిని రూథర్‌ఫోర్డ్‌ లెగ్‌సైడ్‌ భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌కు కుడివైపు నుంచి వెళ్లింది. ఈ క్రమంలో జాక్సన్ డైవ్‌ చేస్తూ అద్భుతమైన సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్‌ అందుకున్న జాక్సన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రసంశించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో జాక్సన్‌ మూడు క్యాచ్‌లు, ఒక స్టంపౌట్‌ చేశాడు. అంతకుమందు సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లోను రాబిన్‌ ఉతప్పను మెరుపు వేగంతో స్టంపౌట్‌ చేసి అందరి చేత జాక్సన్ ప్రశంసలు పొందాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో మూడు వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఓటమి పాలైంది. . తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 128 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేకేఆర్‌ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్‌ (25), ఉమేశ్‌ యాదవ్‌(18) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు, ఆకాశ్‌ దీప్‌ మూడు, హర్షల్‌ పటేల్‌ , సిరాజ్‌ ఒక వికెట్‌ సాదించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి చేధించింది.

షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్‌ క్యాచ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

చదవండి: IPL 2022: అరె ఇషాంత్‌ భయ్యా.. ఇదేం కర్మ!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement