ఈ రియాక్షన్‌కు అర్థమేంటి కోహ్లి..? | Virat Kohlis Funny Reaction after taking Sam Billings catch goes viral | Sakshi
Sakshi News home page

IPL 2022: ఈ రియాక్షన్‌కు అర్ధమేంటి కోహ్లి.. వీడియో వైరల్‌

Published Thu, Mar 31 2022 7:11 PM | Last Updated on Thu, Mar 31 2022 9:08 PM

Virat Kohlis Funny Reaction after taking Sam Billings catch goes viral - Sakshi

PC: IPL.com

టీమిండియా మాజీ కెప్టెన్‌, ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాచ్‌ పట్టిన, రనౌట్‌ చేసిన  తన చేష్టలతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా ఆర్సీబీ-కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో  మరోసారి కోహ్లి తన చర్యలతో అభిమానులను అకట్టుకున్నాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన హార్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో.. సామ్‌ బిల్లింగ్స్‌ ఫుల్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే అది మిస్‌ టైమ్‌ గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లి ఈజీ క్యాచ్‌ అందుకున్నాడు.  అయితే క్యాచ్‌ తీసుకున్న తర్వాత కోహ్లి అభిమానులు వైపు చూస్తూ ఫన్నీ రియాక్షన్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చదవండి: Shoaib Akthar: 'అవకాశమొచ్చినా ఉపయోగించుకోరు.. అదే మన దరిద్రం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement