
Courtesy{: IPL Twittet
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే పడిక్కల్ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్ ఆఖరి బంతిని పడిక్కల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగలడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment