IPL 2022: Kohli Gives Quick Back Massage Glenn Maxwell During RCB Tense Chase Vs RR, Video Viral - Sakshi
Sakshi News home page

Kohli-Maxwell: మ్యాక్స్‌వెల్‌ టెన్షన్‌ పోగొట్టేందుకు కోహ్లి ఏం చేశాడంటే!

Published Wed, Apr 6 2022 5:15 PM | Last Updated on Wed, Apr 6 2022 6:21 PM

IPL 2022: Virat Kohli Massage Glenn Maxwell During RCB Tense Chase Vs RR - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సంచలన విజయం సాధించింది. దినేశ్‌ కార్తిక్‌ విధ్వంసకర బ్యాటింగ్‌(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌)కు తోడూ షాబాజ్‌ అహ్మద్‌(26 బంతుల్లో 45, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడ చూపించడంతో ఆర్‌సీబీ విజయం సాధించింది.ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించిన ఆర్‌సీబీని కార్తీక్‌, షాబాజ్‌ అహ్మద్‌లు కలిసి విజయతీరాలకు చేర్చారు. చివర్లో షాబాజ్‌ ఔటైనా కార్తిక్‌ ఫినిషర్‌గా మ్యాచ్‌ను ముగించాడు.

అయితే చేజింగ్‌ సమయంలో ఏ జట్టుకైనా టెన్షన్‌ ఉండడం సహజం. ఆర్‌సీబీ డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ అది స్పష్టంగా కనిపించింది. జట్టు స్కోరు 114/5 ఉన్నప్పుడు కార్తిక్‌ బౌండరీ బాదాడు. బౌండరీ లైన్‌ కవర్‌ చేసిన కెమెరాలు డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు తిరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో కోహ్లి మ్యాక్స్‌వెల్‌ వద్దకు వచ్చి ' ఇట్స్‌ ఓకే మ్యాక్సీ' అంటూ మెడ, భుజ భాగంలో మసాజ్‌ చేశాడు. మ్యాక్సీ కూడా తన టెన్షన్‌ తీరినట్లుగా ఒక ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Courtesy: IPL Twitter
ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి శాంసన్‌ మెరుపు వేగానికి రనౌట్‌గా వెనుతిరిగాడు. కెప్టెన్‌ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కోహ్లి నుంచి ఆశించిన ఇన్నింగ్స్‌ ఒక్కటి రాలేదు. పెళ్లి వేడుకతో బిజీగా గడిపిన మ్యాక్స్‌వెల్‌ ఇటీవలే జట్టుతో కలిశాడు. ఏప్రిల్‌ 9న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు మ్యాక్సీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరుసగా రెండో విజయం అందుకున్న ఆర్‌సీబీ.. మ్యాక్స్‌వెల్‌ రాకతో రెట్టింపు బలాన్ని సాధించనట్లయింది. గత సీజన్‌లో మ్యాక్సీ ఆర్‌సీబీ తరపున 500 పైచిలుకు పరుగులు సాధించాడు.

చదవండి: IPL 2022: కోహ్లి రనౌట్‌.. చహల్‌ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్‌.. మరీ ఇంత సంతోషమా? వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement