Courtesy: IPL Twitter
ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. లేని పరుగు కోసం యత్నించి చేతులు కాల్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని కోహ్లి కోహ్లి కవర్స్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎక్కువ దూరం కూడా వెళ్లలేదు. సింగిల్‌కు ప్రయత్నించిన కోహ్లి మ్యాక్స్‌వెల్‌కు కాల్ ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్ వద్దని వారించడంతో కోహ్లి వెనక్కి వచ్చేశాడు.
కానీ అప్పటికే బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకొచ్చిన లలిత్ యాదవ్ బులెట్ వేగంతో డెరెక్ట్ త్రో వేశాడు. కోహ్లి క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో కోహ్లి నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా ఐపీఎల్ 2022లో కోహ్లి రనౌట్ కావడం ఇది రెండోసారి. ఇదే సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి తొలిసారి రనౌట్ అయ్యాడు. కాగా ఒకే సీజన్‌లో కోహ్లి రెండుసార్లు రనౌట్ కావడం ఇది రెండోసారి. ఇంతకముందు 2013లోనూ కోహ్లి రెండుసార్లు రనౌట్ అయ్యాడు.
అయితే కోహ్లికి ఐపీఎల్ 2022 సీజన్ కలిసిరావడం లేదనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కోహ్లి మంచి ఆరంభం సాధిస్తున్నప్పటికి పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమవుతున్నాడు. దీనికి తోడు అనవసరంగా లేని పరుగు కోసం యత్నించి రెండుసార్లు రనౌట్ కాగా.. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ పొరపాటు కారణంగా ఎల్బీగా వెనుదిరిగాల్సి వచ్చింది. మొత్తానికి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాకా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలన్న కోరిక కోహ్లికి తీరేలా కనిపించడం లేదు.
Virat Kohli Again RUN-OUT pic.twitter.com/WN0Q6x3gnK
— Keshav Bhardwaj 👀 (@keshxv1999) April 16, 2022
Comments
Please login to add a commentAdd a comment