
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 17 ఓవర్‌లో మొహమ్మద్ సిరాజ్ వేసిన ఫుల్ టాస్ బంతిని కవర్స్ దిశగా బౌండరీ కొట్టడానికి పంత్ ప్రయత్నించాడు. అయితే షాట్ టైమింగ్ కుదిరినప్పటికీ.. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
దీంతో పంత్‌తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షక్షులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న అనుష్క శర్మ వైపు విక్టరీ సింబల్ చూపిస్తూ కోహ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇక కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పేసింది. అప్పటికే 34 పరుగులు సాధించి మంచి ఊపుమీద ఉన్న పంత్ ఔట్ కావడంతో ఢిల్లీకు ఓటమి తప్పలేదు. కోహ్లి క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో మాక్స్‌వెల్(55),కార్తీక్(66) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(66),పంత్(34) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IPL 2022: ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అరుదైన ఫీట్
— Diving Slip (@SlipDiving) April 16, 2022
Comments
Please login to add a commentAdd a comment