IPL 2022: RCB Becomes 1st Team to Conceded Most Sixes in an IPL - Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ.. తొలి జట్టుగా..!

Published Thu, May 26 2022 10:23 AM | Last Updated on Thu, May 26 2022 11:35 AM

RCB becomes 1st team to conceded most sixes in an IPL - Sakshi

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు(PC: ipl/bcci)

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా ఆర్‌సీబీ రికార్డులక్కెంది. ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు 136 సిక్స్‌లు బాదిన ఆర్‌సీబీ ఈ ఘనత సాధించింది. గతంలో 2018 ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ కొట్టిన 135 సిక్స్‌లు రికార్డును ఆర్‌సీబీ బ్రేక్‌ చేసింది. ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ యువ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లో 112 (12 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇక అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం(మే27) జరగనున్న క్వాలిఫైయర్ 2లో రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది.

స్కోర్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 207/4
లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌: 193/6

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement