ఐపీఎల్ చరిత్రలో తొమ్మిదో వాడు
కోల్ కతా: రైజింగ్ పుణే తో ఈడేన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ షెల్డాన్ జాక్సన్ హిట్ వికెట్ అయి అందరిని ఆశ్ఛర్య పరిచాడు. దీంతో ఈసీజన్ లో హిట్ వికెట్ అయిన తొలి బ్యాట్స్ మన్ గా అప్రతిష్టను మూటగటుకున్నాడు. రైజింగ్ పుణే యువ బౌలర్ వాషింగ్టన్ వేసిన 4 ఓవర్లోని చివరి బంతిని వెనక్కి జరిగి డిఫెన్స్ ఆడబోయిన జాక్సన్ వికెట్లు తగలడంతో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో హిట్ వికెట్ గా వెనుదిరిగిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు.
అంతకు ముందు హిట్ వికెట్ అయిన వారిలో యువరాజ్, డెవిడ్ వార్నర్, మిస్భా వుల్ హక్, సౌరభ్ తివారి, రవీంద్ర జడేజా, దీపక్ హుడా , ముసావరి కోటే, స్వప్నిల్ అస్నోద్కర్ లు ఉన్నారు. అయితే గత సీజన్ లో యువరాజ్ సింగ్, డెవిడ్ వార్నర్, దీపక్ హుడా లు హిట్ వికెట్ గా వెనుదిరగడం గమనార్హం.