మధ్యప్రదేశ్ లక్ష్యం 571 | Madhya Pradesh The aim of 571 | Sakshi

మధ్యప్రదేశ్ లక్ష్యం 571

Feb 17 2016 12:40 AM | Updated on Sep 3 2017 5:46 PM

మధ్యప్రదేశ్ లక్ష్యం 571

మధ్యప్రదేశ్ లక్ష్యం 571

మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ముంబై 571 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ప్రస్తుతం 99/2
ముంబైతో రంజీ సెమీస్

  
 కటక్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ముంబై 571 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆదిత్య శ్రీవాస్తవ (53 బ్యాటింగ్), నమన్ ఓజా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జలజ్ సక్సేనా (25), రజత్ పటిదార్ (4) విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ గెలవాలంటే ఇంకా 472 పరుగులు చేయాలి. బుధవారం ఆటకు ఆఖరి రోజు. అంతకుముందు 285/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 125.1 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (115), ఆదిత్య తారే (109) సెంచరీలు సాధించారు. అభిషేక్ నాయర్ (73 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఈశ్వర్ పాండే, హర్‌ప్రీత్ సింగ్ చెరో 3, పునీత్ 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement