Jalaj Saxena
-
రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?.. సెలక్టర్లపై హర్భజన్ సింగ్ ఫైర్!
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టును ఎంపిక చేస్తే ఆటగాళ్లు ఇకపై రంజీలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డుకాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ సత్తా చాటుతున్నాడు. ఇటీవలే అతడు రంజీ ట్రోఫీలో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 400 వికెట్ల మార్కు దాటాడు. తద్వారా రంజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.అయితే, 37 ఏళ్ల సక్సేనా ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియాకు ఆడలేకపోయాడు. 2005లో సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫు ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఆరంభించిన జలజ్.. పదకొండేళ్ల పాటు అదే జట్టుతో కొనసాగాడు. 2016-17 సీజన్ నుంచి కేరళకు ప్రాతినిథ్యం వహిస్తున్న జలజ్ సక్సేనా ఇటీవల ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా జలజ్ సక్సేనా ఘనతను ప్రస్తావిస్తూ.. ‘‘రంజీ ట్రోఫీలో 400 వికెట్లు, 6000 పరుగులు. భారత్‌లోని జాతీయ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి. అయినప్పటికీ ఇతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదు.అతడొక చాంపియన్. నిలకడగా ఆడుతున్న ప్లేయర్. ఇంతకంటే.. ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టు పోస్టుకు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?‘‘మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కనీసం ఇండియా-‘ఎ’ జట్టుకైనా అతడిని ఎంపిక చేయాల్సింది. ప్రస్తుత కాలంలో రంజీ ఆడటం పనికిరాని విషయంగా మారిపోయిందా?.. ఐపీఎల్ నుంచే ఆటగాళ్లను సెలక్ట్ చేస్తున్నారు’’ అంటూ భజ్జీ టీమిండియా సెలక్టర్ల తీరును ఘాటుగా విమర్శించాడు.కాగా టీమిండియా ఇటీవల స్వదేశంలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టుల్లో క్లీన్‌స్వీప్ అయిన తొలి భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-‘ఎ’ జట్టు సైతం రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ దిశగా పయనిస్తోంది. చదవండి: Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు -
Ranji Trophy: చరిత్ర సృష్టించిన జలజ్ సక్సేనా
కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో 6000 పరుగులు సహా 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సక్సేనా 400 వికెట్ల మార్కును క్రాస్ చేశాడు. సక్సేనా బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 6000 పరుగుల మార్కును తాకాడు. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ తీయడంతో సక్సేనా 400 వికెట్ల క్లబ్లో చేరాడు. సక్సేనా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. రంజీ కెరీర్లో అతనికి ఇది 29వ ఐదు వికెట్ల ఘనత. 37 ఏళ్ల సక్సేనా రంజీ చరిత్రలో 400 వికెట్లు తీసిన 13వ బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. 2005లో మధ్యప్రదేశ్‌తో తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను మొదలుపెట్టిన సక్సేనా.. ఆ రాష్ట్రం తరఫున 11 ఏళ్ల వ్యవధిలో 159 వికెట్లు, 4041 పరుగులు స్కోర్ చేశాడు. ఆతర్వాత 2016-17 సీజన్ నుంచి సక్సేనా కేరళ జట్టుకు మారాడు. ప్రస్తుతం సక్సేనా కేరళ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కేఎన్ అనంతపద్మనాభన్ టాప్‌లో ఉన్నాడు. సక్సేనా గత రంజీ సీజన్లో దిగ్గజాల సరసన చేరాడు. భారత దేశవాలీ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 9000 పరుగులు, 600 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సక్సేనాకు ముందు వినూ మన్కడ్, మదన్‌లాల్, పర్వేజ్ రసూల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ సక్సేనా విజృంభించడంతో (5/56) ఉత్తర్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి 2, సర్వటే, కేఎమ్ ఆసిఫ్, అపరాజిత్ తలో వికెట్ పడగొట్టారు. యూపీ ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు శివమ్ శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (21), సర్వటే (4) క్రీజ్‌లో ఉన్నారు. యూపీ బౌలర్లలో శివమ్ మావి, ఆకిబ్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. యూపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 80 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: సెలెక్టర్లకు సవాలు విసిరిన శ్రేయస్ అయ్యర్.. వరుసగా రెండు సెంచరీలు -
37 ఏళ్ల వయస్సులో అద్బుతం.. ఏకంగా 9 వికెట్లు! సంజూ ఫుల్ హ్యాపీ
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ గ్రూపు-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ, బెంగాల్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేరళ వెటరన్ స్పిన్నర్ జలజ్ సక్సేనా సంచలన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 వికెట్లతో సక్సేనా చెలరేగాడు. సక్సేనా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న బెంగాల్ బ్యాటర్లు విల్లావిల్లాడారు. 21.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జలజ్ కేవలం 68 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పిన్ మయాజాలం ఫలితంగా బెంగాల్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. కాగా సక్సేనాకు ఇవే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో కేరళ బౌలర్‌గా సక్సేనా నిలిచాడు. ఈ జాబితాలో కేరళ గ్రేట్ స్పిన్నర్ అమర్జిత్ సింగ్ ఉన్నారు. 1972-73 రంజీ సీజన్లో ఓమ్యాచ్లో అమర్జిత్ 49 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే 1973 తర్వాత మళ్లీ ఓ కేరళ బౌలర్ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. కాగా సక్సేనా ప్రదర్శన పట్ల కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. అతడొక మాస్టర్ క్లాస్ స్పిన్నర్ అని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేరళ 363 పరుగులకు ఆలౌటైంది. కేరళ బ్యాటర్లలో సచిన్ బేబి(124) అక్షయ్ చంద్రన్(106) సెంచరీలతో రాణించారు. సంజూ మాత్రం కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. -
రికార్డుపుటల్లోకెక్కిన కేరళ క్రికెటర్
కేరళ క్రికెటర్ జలజ్ సక్సేనా రికార్డుపుటల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సమర్థ్ సింగ్ వికెట్ తీయడంతో దేశవాలీ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు కలిపి) 600 వికెట్ల అరుదైన మైలురాయిని తాకాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన జలజ్.. ప్రొఫెషనల్ క్రికెట్లో 600 వికెట్లు పడగొట్టడంతో పాటు 9000కు పైగా పరుగులు చేసి అత్యంత అరుదైన డబుల్‌ను సాధించాడు. జలజ్‌కు ముందు దేశవాలీ క్రికెట్లో ఈ ఘనతను కేవలం ఇద్దరు మాత్రమే సాధించారు. వినూ మన్కడ్, మదన్ లాల్ మాత్రమే ప్రొఫెషనల్ క్రికెట్లో 9000 పరుగులు, 600 వికెట్ల మైలురాయిని తాకారు. ఇదిలా ఉంటే, కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ పట్టుబిగించింది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. యూపీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆర్యన్ జుయెల్ (115) సెంచరీతో కదంతొక్కగా.. ప్రియం గార్గ్ (95) సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. సమర్థ్ సింగ్ (43) ఓ మోస్తరుగా రాణించగా.. ప్రియం గార్గ్‌కు జతగా ఆక్ష్‌దీప్ సింగ్ (28) క్రీజ్‌లో ఉన్నాడు. జలజ్ సక్సేనా, బాసిల్ థంపి తలో వికెట్ పడగొట్టారు. Jalaj Saxena becomes the third Indian player to achieve the double of 9000 runs and 600 wickets across domestic formats. He's just behind Vinoo Mankad and Madan Lal. @jalajsaxena33 pic.twitter.com/U1oo9rDPb4 — CricTracker (@Cricketracker) January 8, 2024 అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. కేరళ ఇన్నింగ్స్‌లో విష్ణు వినోద్ (74) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. సంజూ శాంసన్ (25), శ్రేయస్ గోపాల్ (36), సచిన్ బేబి (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంకిత్ రాజ్‌పుత్ 5 వికెట్ల ఘనతతో కేరళ పతనాన్ని శాశించగా.. కుల్దీప్ యాదవ్ 3, యశ్ దయాల్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్ (92) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. దృవ్ జురెల్ (63) అర్ధసెంచరీతో రాణించాడు. నిదీశ్ 3, జలజ్ సక్సేనా, బాసిల్ థంపి తలో 2 వికెట్లు, వైశాక్ చంద్రన్, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ పడగొట్టారు. -
భారత క్రికెట్ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. సిగ్గుతో తలదించుకోవాలి..!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై ధ్వజమెత్తాడు. మధ్యప్రదేశ్, భారత-ఏ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా జలజ్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు. జట్ల ఎంపికలో సెలెక్టర్లు అవళింభిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్లో హాస్యాస్పదమైన విషయాలు చాలా జరుగుతున్నాయని, జలజ్ ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే అని అన్నాడు. రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81 — Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023 ఈ విషయాలను ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఫోరమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన వెంకటేశ్ ప్రసాద్ ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాకు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాగే సెలెక్టర్లను నిలదీశాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోయినా టీమిండియాకు ఎలా ఎంపిక చేస్తారని ప్రసాద్ నాడు సెలెక్టర్లను ప్రశ్నించాడు. కాగా, 36 ఏళ్ల జలజ్ సక్సేనా 2022-23 రంజీ సీజన్లో 7 మ్యాచ్‌ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో ఇతనే లీడింగ్ వికెట్‌టేకర్. ఓవరాల్‌గా జలజ్ తన దేశవాలీ కెరీర్లో 133 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 104 లిస్ట్-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఓ మ్యాచ్ ఆడాడు. I DONT understand selection committee these days BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023. There has been no first class matches post that , but he doesn't feature for SOUTH ZONE in the duleep trophy. Can someone tell me why??#bcci — DK (@DineshKarthik) June 14, 2023 ఇదిలా ఉంటే, దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుపై టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమిళనాడు ఆటగాడు బాబా ఇంద్రజిత్‌ను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై డీకే సౌత్ జోన్ సెలెక్టర్లను నిలదీశాడు. -
అతడి కోసమే ఇలా! భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? క్రికెటర్ ట్వీట్ వైరల్
Duleep Trophy 2023: అద్భుతంగా రాణించినప్పటికీ తనకు దులిప్ ట్రోఫీ టోర్నీ ఆడే జట్టులో చోటు కల్పించకపోవడంపై కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘోరం ఎప్పుడైనా జరిగిందా అంటూ సెలక్టర్ల తీరును ప్రశ్నించాడు. తానెవరినీ తప్పుబట్టడం లేదని, అయితే.. తనను ప్రతిష్టాత్మక ట్రోఫీ ఆడే జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పగలరా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2022-23 రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో కేరళ తరఫున వెటరన్ ఆల్‌రౌండర్ జలజ్ ఏడు మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కోసం? బ్యాట్‌తోనూ రాణించి కేరళ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, దులిప్ ట్రోఫీ ఆడే క్రమంలో సౌత్ జోన్ జట్టును ఎంపిక చేసే క్రమంలో 36 ఏళ్ల జలజ్‌ను సెలక్టర్లు విస్మరించారు. తమిళనాడు ఆల్‌రౌండర్, టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించేందుకు ఈ కేరళ ప్లేయర్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు జట్టులో స్థానం లేకపోవడాన్ని జీర్ణించుకోలేని జలజ్ సక్సేనా ట్విటర్ వేదికగా ఆవేదనను పంచుకున్నాడు. ‘‘భారత్‌లో రంజీ ట్రోఫీ(ఎలైట్ గ్రూప్) టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిని దులిప్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేయలేదు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? చరిత్రను తిరగేయండి దయచేసి.. నాకోసం ఒక్కసారి చరిత్రను తిరగేయండి! కేవలం ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంతే! ఎవరినీ నిందించే ఉద్దేశం నాకైతే లేదు’’ అంటూ జలజ్ ఆవేదనభరిత ట్వీట్ చేశాడు. కాగా దులిప్ ట్రోఫీ సౌత్ జోన్ సెలక్షన్ విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జలజ్‌తో పాటు తమిళనాడు ప్లేయర్ బాబా ఇంద్రజిత్‌ను కూడా పక్కనపెట్టడంతో సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఈ విషయంపై స్పందిస్తూ.. సెలక్షన్ కమిటీ అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. రెస్టాఫ్ ఇండియాకు ఆడిన బాబా ఇంద్రజిత్‌ను ఎందుకు ఎంపికచేయలేదో ఎవరైనా చెప్పగలరా అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు. సెలక్టర్లు ఏం చేస్తున్నారో వాళ్లకైనా అర్థమవుతోందా అంటూ ఫైర్ అయ్యారు. కాగా బెంగళూరు వేదికగా జూన్ 28 నుంచి దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. జూలై 12-16 వరకు ఫైనల్ జరుగనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్, సౌత్ జోన్ల జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. చదవండి: Ind vs WI: రోహిత్, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్! ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్‌లో ఇరు జట్లు Highest wicket taker in Ranji trophy in India( Elite Group) didn't get picked in Duleep trophy. Can you please check whether it has ever happened in the Indian Domestic history? Just wanted to know. Not blaming anyone 🙏 https://t.co/Koewj6ekRt — Jalaj Saxena (@jalajsaxena33) June 17, 2023 -
ఓటమి ప్రమాదంలో ఆంధ్ర
తిరువనంతపురం: ఓపెనర్‌గా వచ్చి సెంచరీతో చెలరేగిన కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఆంధ్రను దెబ్బ తీశాడు. జలజ్ (7/44) అద్భుత ప్రదర్శనతో ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఓటమి దిశగా పయనిస్తోంది. మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. రికీ భుయ్ (30 బ్యాటింగ్) కొద్దిగా ప్రతిఘటించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మొదటి 3 వికెట్లలో రెండు పడగొట్టిన జలజ్... తన ఆఫ్‌స్పిన్‌తో ఆ తర్వాత వరుసగా ఐదు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం కోల్పోయిన జట్టు ప్రస్తుతం చేతిలో ఉన్న 2 వికెట్లతో 28 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 227/1తో ఆట కొనసాగించిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌటైంది. ‘డ్రా’ దిశగా: హైదరాబాద్, తమిళనాడు మధ్య తిరునల్వేలిలో జరుగుతున్న మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (101 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీ సాధించగా, సీవీ మిలింద్కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు 523/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 8 వికెట్లకు 565 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అక్షత్ రెడ్డి (250) మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు. -
జలజ్ శతకం: కేరళ 227/1
తిరువనంతపురం: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ భారీ ఆధిక్యానికి బాటలు పర్చుకుంది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (127 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, అరుణ్ కార్తీక్ (56) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ప్రస్తుతం జలజ్‌తో పాటు రోహన్ ప్రేమ్ (34 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఆంధ్ర జట్టు మరో 29 పరుగులు జత చేసి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌటైంది. -
మధ్యప్రదేశ్ లక్ష్యం 571
ప్రస్తుతం 99/2 ముంబైతో రంజీ సెమీస్ కటక్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ముంబై 571 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆదిత్య శ్రీవాస్తవ (53 బ్యాటింగ్), నమన్ ఓజా (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జలజ్ సక్సేనా (25), రజత్ పటిదార్ (4) విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ గెలవాలంటే ఇంకా 472 పరుగులు చేయాలి. బుధవారం ఆటకు ఆఖరి రోజు. అంతకుముందు 285/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 125.1 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (115), ఆదిత్య తారే (109) సెంచరీలు సాధించారు. అభిషేక్ నాయర్ (73 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఈశ్వర్ పాండే, హర్‌ప్రీత్ సింగ్ చెరో 3, పునీత్ 2 వికెట్లు తీశారు.