తిరువనంతపురం: ఓపెనర్‌గా వచ్చి సెంచరీతో చెలరేగిన కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఆంధ్రను దెబ్బ తీశాడు. జలజ్ (7/44) అద్భుత ప్రదర్శనతో ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఓటమి దిశగా పయనిస్తోంది. మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. రికీ భుయ్ (30 బ్యాటింగ్) కొద్దిగా ప్రతిఘటించడం మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మొదటి 3 వికెట్లలో రెండు పడగొట్టిన జలజ్... తన ఆఫ్‌స్పిన్‌తో ఆ తర్వాత వరుసగా ఐదు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం కోల్పోయిన జట్టు ప్రస్తుతం చేతిలో ఉన్న 2 వికెట్లతో 28 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 227/1తో ఆట కొనసాగించిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌటైంది.
‘డ్రా’ దిశగా: హైదరాబాద్, తమిళనాడు మధ్య తిరునల్వేలిలో జరుగుతున్న మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (101 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీ సాధించగా, సీవీ మిలింద్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు 523/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 8 వికెట్లకు 565 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అక్షత్ రెడ్డి (250) మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు.
ఓటమి ప్రమాదంలో ఆంధ్ర
Published Thu, Nov 15 2018 2:37 AM | Last Updated on Thu, Nov 15 2018 2:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment