
తిరువనంతపురం: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ భారీ ఆధిక్యానికి బాటలు పర్చుకుంది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (127 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, అరుణ్ కార్తీక్ (56) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ప్రస్తుతం జలజ్‌తో పాటు రోహన్ ప్రేమ్ (34 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఆంధ్ర జట్టు మరో 29 పరుగులు జత చేసి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment