Ranji Trophy 2024: కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. సెమీస్‌కు ముంబై | Ranji Trophy 2024: Vidarbha Enters Semi Finals By Beating Karnataka In 1st Quarter Final | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. సెమీస్‌కు ముంబై

Published Tue, Feb 27 2024 3:44 PM | Last Updated on Tue, Feb 27 2024 4:13 PM

Ranji Trophy 2024: Vidarbha Enters Semi Finals By Beating Karnataka In 1st Quarter Final - Sakshi

భారత దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీ చివరి దశకు చేరింది. ఈ సీజన్‌లో తమిళనాడు, మధ్యప్రదేశ్‌, విదర్భ, ముంబై జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సౌరాష్ట్రను ఓడించి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గి మధ్యప్రదేశ్‌.. కర్ణాటకను చితు​ చేసి విదర్భ సెమీస్‌ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. బరోడాపై తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ ఆధారంగా ముంబై ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించింది. 

కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ..

  • విదర్భ తొలి ఇన్నింగ్స్‌ 460 (అథర్వ్‌ తైడే 109, కావేరప్ప 4/99)
  • కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ 286 (నికిన్‌ జోస్‌ 82, యశ్‌ ఠాకూర్‌ 3/48)
  • విదర్భ రెండో ఇన్నింగ్స్‌ 196 (దృవ్‌ షోరే 57, కావేరప్ప 6/61)
  • కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌ 243 (మయాంక్‌ అగర్వాల్‌ 70, హర్ష్‌ దూబే 4/65)
  • 127 పరుగుల తేడాతో గెలుపొందిన విదర్భ

డ్రాగా ముగిసిన బరోడా-ముంబై మ్యాచ్‌..

  • ముంబై తొలి ఇన్నింగ్స్‌ 384 (ముషీర్‌ ఖాన్‌ 203 నాటౌట్‌, భార్గవ్‌ భట్‌ 7/112)
  • బరోడా తొలి ఇన్నింగ్స్‌ 348 (విక్రమ్‌ సోలంకి 136, షమ్స్‌ ములానీ 4/121)
  • ముంబై రెండో ఇన్నింగ్స్‌ 569 (తుషార్‌ దేశ్‌పాండే 123, భార్గవ్‌ భట్‌ 7/200)
  • బరోడా రెండో ఇన్నింగ్స్‌ 121/3 (ప్రియాన్షు్‌ మోలియా 54, తనుశ్‌ కోటియన్‌ 2/16)
  • తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌ ఆధారంగా సెమీస్‌కు చేరిన ముంబై

ఏడేళ్ల తర్వాత సెమీస్‌కు చేరిన తమిళనాడు..

  • సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ 183 (హార్విక్‌ దేశాయ్‌ 83, సాయికిషోర్‌ 5/66)
  • తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌ 338 (బాబా ఇంద్రజిత్‌ 80, చిరాగ్‌ జానీ 3/22)
  • సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌ 122 (పుజారా 46, సాయికిషోర్‌ 4/27)
  • ఇన్నింగ్స్‌ 33 పరుగుల తేడాతో తమిళనాడు విజయం

ఉత్కంఠ పోరులో నాలుగు పరుగుల తేడాతో ఓడిన ఆంధ్ర..

  • మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 234 యశ్‌ దూబే 64, శశికాంత్‌ 4/37)
  • ఆంధ్రప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 172 (కరణ్‌ షిండే 38, అనుభవ్‌ అగార్వల్‌ 3/33)
  • మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 107 (హిమాన్షు మంత్రి 43, నితీశ్‌ రెడ్డి 4/28)
  • ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌ 165 (హనుమ విహారి 55, అనుభవ్‌ అగర్వాల్‌ 6/52)
  • 4 పరుగుల తేడాతో గెలుపొందిన మధ్య ప్రదేశ్‌

సెమీస్‌ మ్యాచ్‌లు ఇలా..

  • మార్చి 2-6: విదర్భ వర్సెస్‌ మధ్యప్రదేశ్‌ (1st semi final)
  • మార్చి 2-6: ముంబై వర్సెస్‌ తమిళనాడు (2nd semi final)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement