రంజీ ట్రోఫీ 2024 తొలి సెమీఫైనల్లో విదర్భ జట్టు 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఎంపీ టీమ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (97 నాటౌట్).. కెప్టెన్ అక్షయ్ వాద్కర్‌తో (77) కలిసి బాధ్యతాయుతమై ఇన్నింగ్స్ ఆడి విదర్భకు ఆధిక్యతను అందించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలిన విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని మధ్యప్రదేశ్‌పై పైచేయి సాధించింది. యశ్, అక్షయ్‌తో పాటు అయన్ మోఖడే (59) అర్దసెంచరీతో రాణించగా.. దృవ్ షోరే (40), కరుణ్ నాయర్ (38) పర్వాలేదనిపించారు. యశ్‌తో పాటు ఆదిత్య సర్వటే (14) క్రీజ్‌లో ఉన్నాడు.
ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, కేజ్రోలియా చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో మంత్రి మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. విదర్భ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, యశ్ ఠాకూర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. వాఖరే 2, సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నారు.
దీనికి ముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఆవేశ్ ఖాన్ (4/49), కేజ్రోలియా (2/38), వెంకటేశ్ అయ్యర్ (2/28), అనుభవ్ అగర్వాల్ (1/42), కుమార్ కార్తికేయ (1/2) విదర్భ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. విదర్భ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (63) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కాగా, మరో సెమీఫైనల్లో తమిళనాడును మట్టికరిపించి ముంబై ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment