Syed Mushtaq Ali T20: Darshan Nalkande Picks 4 Wkts 4 Balls Semi-Final - Sakshi
Sakshi News home page

Darshan Nalkande: ఆఖరి ఓవర్‌లో అద్భుతం.. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు

Published Sat, Nov 20 2021 7:05 PM | Last Updated on Sun, Nov 21 2021 12:04 PM

Syed Mushtaq Ali T20: Darshan Nalkande Picks 4 Wkts 4 Balls Semi-Final - Sakshi

Darshan Nalkande Pics 4 Wkts In Four Consecutive Balls.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలో భాగంగా శనివారం ఒక అద్భుత ఘటన జరిగింది. విదర్భ, కర్ణాటక మధ్య జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్‌లో విదర్భ బౌలర్‌ దర్శన్‌ నల్కండే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అందులోనూ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ఈ ఫీట్‌ నమోదు చేయడం విశేషం.

చదవండి: Syed Mustaq Ali T20: ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్‌కు

ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ వేసిన దర్శన్‌ నల్కండే.. తొలి బంతికి అనిరుద్ద జోషిని వెనక్కిపంపాడు. తర్వాత వరుస బంతుల్లో శరత్‌ బీఆర్‌, జగదీష్‌ సుచిత్‌లు పెవిలియన్‌ చేర్చి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇక చివరగా నాలుగో బంతికి ఇన్‌ఫాం బ్యాటర్‌ అభినవ్‌ మనోహర్‌ను ఔట్‌ చేసి నాలుగో వికెట్‌ సాధించాడు. ఈ నలుగురిలో అభివన్‌ మనోహర్‌ వికెట్‌ పెద్దది. దీంతో దర్శన నల్కండే అద్భుత ప్రదర్శనపై ట్విటర్‌లో ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటక చేతిలో విదర్భ పరాజయం పాలైంది. ఇక ఫైనల్‌ చేరిన కర్ణాటక నవంబర్‌ 22న తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. 

చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్‌ స్మిత్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement