Darshan Nalkande
-
#NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు..
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 పోరులో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే నోబాల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మూడో బంతిని గైక్వాడ్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న గిల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ రుతురాజ్ వెనుదిరగడంతో తొలి వికెట్ దక్కిందన్న సంతోషం దర్శన్ నల్కండే మొహంలో కనిపించింది. కానీ మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైంది. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో రుతురాజ్ ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చాడు. అలా నోబాల్ అవడంతో బతికిపోయిన రుతురాజ్ ఆ తర్వాత 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అంటే ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు అన్నమాట. తొలి ఇన్నింగ్స్ కావడంతో రుతురాజ్ ఇన్నింగ్స్ ఎంతవరకు గుజరాత్‌కు నష్టం తెస్తుందనేది చెప్పలేం. Gaikwad: From🙁 to 🤩 A twist of fate sees Ruturaj maximize with the bat in #GTvCSK ⚔️#IPLPlayOffs #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/dOfabAaXTS — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్ -
ఆఖరి ఓవర్లో అద్భుతం.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు
Darshan Nalkande Pics 4 Wkts In Four Consecutive Balls.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా శనివారం ఒక అద్భుత ఘటన జరిగింది. విదర్భ, కర్ణాటక మధ్య జరిగిన సెమీఫైనల్లో మ్యాచ్‌లో విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అందులోనూ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. చదవండి: Syed Mustaq Ali T20: ఓటమి నుంచి తృటిలో తప్పించుకొని ఫైనల్‌కు ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన దర్శన్ నల్కండే.. తొలి బంతికి అనిరుద్ద జోషిని వెనక్కిపంపాడు. తర్వాత వరుస బంతుల్లో శరత్ బీఆర్, జగదీష్ సుచిత్‌లు పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక చివరగా నాలుగో బంతికి ఇన్ఫాం బ్యాటర్ అభినవ్ మనోహర్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్ సాధించాడు. ఈ నలుగురిలో అభివన్ మనోహర్ వికెట్ పెద్దది. దీంతో దర్శన నల్కండే అద్భుత ప్రదర్శనపై ట్విటర్లో ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక చేతిలో విదర్భ పరాజయం పాలైంది. ఇక ఫైనల్ చేరిన కర్ణాటక నవంబర్ 22న తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్ స్మిత్! pic.twitter.com/hAios7nHR0 — Simran (@CowCorner9) November 20, 2021