Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే నోబాల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
మూడో బంతిని గైక్వాడ్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న గిల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ రుతురాజ్ వెనుదిరగడంతో తొలి వికెట్ దక్కిందన్న సంతోషం దర్శన్ నల్కండే మొహంలో కనిపించింది. కానీ మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైంది. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో రుతురాజ్ ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చాడు.
అలా నోబాల్ అవడంతో బతికిపోయిన రుతురాజ్ ఆ తర్వాత 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అంటే ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు అన్నమాట. తొలి ఇన్నింగ్స్ కావడంతో రుతురాజ్ ఇన్నింగ్స్ ఎంతవరకు గుజరాత్‌కు నష్టం తెస్తుందనేది చెప్పలేం.
Gaikwad: From🙁 to 🤩
— JioCinema (@JioCinema) May 23, 2023
A twist of fate sees Ruturaj maximize with the bat in #GTvCSK ⚔️#IPLPlayOffs #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/dOfabAaXTS
చదవండి: డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment