Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. షమీ వేసిన 20వ ఓవర్ నాలుగో బంతిని మొయిన్ అలీ మిస్ చేశాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జడేజా పరుగు కోసం చిరుత పులిలా పరిగెత్తుకొచ్చాడు.
అయితే ఇది గమనించని మొయిన్ అలీ అప్పుడు క్రీజు నుంచి కదిలాడు. అయితే బంతిని అందుకున్న సాహా వికెట్ల వైపు విసరగా.. అప్పటికే జడ్డూ తన బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. జడేజా బ్యాట్ పెట్టేలోపు మొయిన్ అలీ ఇంకా అతని వెనకాలే ఉన్నాడు. ఒకవేళ సాహా నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు బంతిని విసిరి ఉంటే మొయిన్ అలీ కచ్చితంగా రనౌట్ అయ్యేవాడే కానీ తప్పించుకున్నాడు.
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు..''జడ్డూ చిరుతపులిలా పరిగెత్తుకొస్తే.. మొయిన్ అలీ మాత్రం ముసలోడిలా పరిగెత్తాడు'' అంటూ కామెంట్ చేశారు.
Jadeja returned from School and Moeen Ali is just going to School 😭 pic.twitter.com/9xz1SFhUpT
— ♚ (@balltamperrer) May 23, 2023
చదవండి: దీపక్ చహర్ అరుదైన ఘనత..
Comments
Please login to add a commentAdd a comment