
59 పరుగులకు ఆలౌట్!
రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టు సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది.
కోల్కతా:రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టు సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్లో విదర్భను తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులకే కుప్పకూల్చింది. మహారాష్ట్ర మీడియం పేసర్ అనుపమ్ సంక్లేచా ఏడు వికెట్లతో అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 11 ఓవర్లలో 25 పరుగులిచ్చిన అనుపమ్.. ఏడు వికెట్లు సాధించి విదర్భ వెన్నువిరిచాడు.
విదర్భ ఆటగాడు శ్రీవాస్తవ (19) ఒక్కడే రెండంకెల మార్కును చేరగా, మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజట్ కే పరిమితమయ్యారు. ఇది విదర్భకు రంజీల్లో ఐదో అత్యల్ప స్కోరు. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 332 పరుగులు చేసింది. నౌషద్ షేక్(127),అంకిత్ బావ్నే(111) శతకాలతో మెరిశారు.