మహారాష్ట్రలోని విదర్భ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత రెండు ఎన్నికల్లో విదర్భ ఓటర్లు బీజేపీ, శివసేన జంటకు తమ మద్దతు పలికారు. తూర్పు విదర్భలో బీజేపీ, పశ్చిమాన శివసేన గట్టి పట్టు సాధించాయి.
అయితే 1960 నుంచి 2009 వరకు విదర్భ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనప్పుడు విదర్భ ప్రజలు ఇందిరా గాంధీకి మద్దతుగా నిలిచారు. విదర్భ అనేది తూర్పు మహారాష్ట్రలోని 11 జిల్లాలు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగ్‌పూర్, రామ్‌టెక్, చంద్రాపూర్, గోండియా భండారా గడ్చిరోలి స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. రెండో దశలో ఏప్రిల్ 26న అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్ వాషిం, బుల్దానా స్థానాలకు పోలింగ్ జరగనుంది.
శివసేనకు చెందిన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే, ఎన్‌సిపికి చెందిన శరద్ పవార్, కాంగ్రెస్‌కు చెందిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి, అధికార బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ (అజిత్ వర్గం) మహాకూటమి మధ్య అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంది. హైవే మ్యాన్‌గా బిరుదు పొందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి నాగ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. నాగ్‌పూర్ సౌత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వికాస్ ఠాక్రేను పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీనిస్తుండగా, గడ్కరీ హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం విదర్భ పరిధిలోని నాగ్‌పూర్‌లో ఉంది. పొరుగున ఉన్న వార్ధా నియోజకవర్గం మహాత్మా గాంధీ జన్మస్థలం. రైతు ఆత్మహత్యలకు నెలవైన విదర్భలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. 64 సంవత్సరాల క్రితం విదర్భ ప్రాంతం నాగ్‌పూర్ ఒప్పందం కింద మహారాష్ట్రలో విలీనమైంది. మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే విదర్భలోని మొత్తం 62 సీట్లలో, బీజెపీ 29, అవిభక్త శివసేన 4, ఎన్‌సీపీ 6, కాంగ్రెస్ 15 ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. 2014లో విదర్భలో బీజేపీ 44 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment