Ranji match
-
హైదరాబాద్ 536/8 డిక్లేర్డ్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పుదుచ్చేరితో పోరులో బ్యాటర్లంతా కలిసి కట్టుగా కదం తొక్కడంతో హైదరాబాద్ జట్టు 163 ఓవర్లలో 536/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (328 బంతుల్లో 173; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... రోహిత్ రాయుడు (84; 7 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ (60; 7 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 290/1తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు తన్మయ్, రోహిత్ 220 పరుగులు జోడించడంతో గట్టి పునాది పడింది. కెపె్టన్ రాహుల్ సింగ్ (27), వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (24) ఎక్కువ సేపు నిలవలేకపోగా... చామా మిలింద్ (7) ఆకట్టుకోలేకపోయాడు. మిడిలార్డర్ విఫలమైనా... ఆఖర్లో తనయ్ త్యాగరాజన్ మెరుపులు మెరిపించాడు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 3, సతీశ్ రెండు వికెట్లు పడగొట్టారు. కొండంత స్కోరు చేసిన అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... చివరి గంటలో బ్యాటింగ్‌కు వచ్చిన పుదుచ్చేరి బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పుదుచ్చేరి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. శ్రీధర్ రాజు (19), సాగర్ (0) అవుట్ కాగా... వికెట్ కీపర్ అజయ్ రొహెరా (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పుదుచ్చేరి జట్టు... హైదరాబాద్ స్కోరుకు ఇంకా 512 పరుగులు వెనుకబడి ఉంది. గౌరవ్ యాదవ్ (0 బ్యాటింగ్), ఆకాశ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) (సబ్) విఘ్నేశ్వరన్ (బి) అంకిత్ శర్మ 173; అభిరత్ రెడ్డి (సి) అరుణ్ కార్తీక్ (బి) సాగర్ 68; రోహిత్ రాయుడు (బి) ఫాబిద్ అహ్మద్ 84; హిమతేజ (సి) అమన్ (బి) సతీశ్ 60; రాహుల్ సింగ్ (సి) గంగ శ్రీధర్ రాజు (బి)గౌరవ్ యాదవ్ 27; రాహుల్ రాధేశ్ (సి అండ్ బి) అంకిత్ శర్మ 24; చామా మిలింద్ (బి) సతీశ్ 7; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 53; అనికేత్ రెడ్డి (బి) అంకిత్ శర్మ 12; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (163 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్) 536. వికెట్ల పతనం: 1–111, 2–231, 3–345, 4–397, 5–440, 6–458, 7–460, 8–486. బౌలింగ్: గౌరవ్ యాదవ్ 35–9–102–1; సాగర్ 31–5–98–1; ఫాబిద్ అహ్మద్ 30–6–78–1; అమన్ ఖాన్ 11–1–55–0; అంకిత్ శర్మ 35–1–117–3, సతీశ్ 20–2–72–2. -
రాణించిన రాహుల్ రాధేశ్, హిమతేజ
డెహ్రాడూన్: మిడిలార్డర్ రాణించడంతో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడుతోంది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న ఈ పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (174 బంతుల్లో 82 బ్యాటింగ్; 9 ఫోర్లు), కొడిమేల హిమతేజ (147 బంతుల్లో 78; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (30; 4 ఫోర్లు), కెప్టెన్ రాహుల్ సింగ్ (21; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించగా... అభిరత్ రెడ్డి (0), రోహిత్ రాయుడు (7) విఫలమయ్యారు. ఉత్తరాఖండ్ బౌలర్లు రాణించడంతో తొలి ఓవర్లోనే హైదరాబాద్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే అభిరత్ రెడ్డి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు పడటంతో ఒక దశలో హైదరాబాద్ 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హిమతేజ, రాహుల్ రాధేశ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ జంట ఐదో వికెట్‌కు 142 పరుగులు జోడించడంతో హైదరాబాద్ జట్టు కోలుకోగలిగింది. ఉత్తరాఖండ్ బౌలర్లలో దేవేంద్రసింగ్ బోరా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 313/8తో శనివారం తొల ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ చివరకు 325 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 4 వికెట్లు పడగొట్టగా... మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనే చేస్తున్న హైదరాబాద్ జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 81 పరుగులు వెనుకబడి ఉంది. రాహుల్ రాధేశ్తో పాటు తనయ్ త్యాగరాజన్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: 325; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) దేవేంద్రసింగ్ బోరా 30; అభిరత్ రెడ్డి (సి) ఆదిత్య (బి) దీపక్ ధాపోలా 0; రాహుల్ సింగ్ (సి) వైభవ్ భట్ (బి) అభయ్ నేగీ 21; రోహిత్ రాయుడు (ఎల్బీడబ్ల్యూ) ఆకాశ్ మధ్వాల్ 7; హిమతేజ (సి) అవనీశ్ సుధ (బి) దేవేంద్రసింగ్ బోరా 78; రాహుల్ రాధేశ్ (నాటౌట్) 82; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (78 ఓవర్లలో 5 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–1, 2–39, 3–53, 4–64, 5–206, బౌలింగ్: దీపక్ ధాపోలా 13–2–31–1; ఆకాశ్ మధ్వాల్ 10–0–41–1; అభయ్ నేగీ 16–2–40–1; దేవేంద్ర సింగ్ బోరా 15–1–51–2; అవనీశ్ సుధ 10–2–21–0; స్వప్నిల్ సింగ్ 13–3–46–0; రవికుమార్ సమర్్థ1–0–6–0. -
ఢిల్లీ లక్ష్యం 84
న్యూఢిల్లీ: ఢిల్లీతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి అంచున నిలిచింది. ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ తన రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటై... 84 పరుగుల విజయలక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఢిల్లీ శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 7 ఓవర్లలో 24 పరుగులు చేసింది. కునాల్ (6), శిఖర్ ధావన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 20/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ను ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (154 బంతుల్లో 103; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో ఆదుకున్నాడు. 97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాభవం తప్పదనుకున్న స్థితిలో... తన్మయ్ టెయిలెండర్లతో పలు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. తనయ్ త్యాగరాజన్ (70 బంతుల్లో 34; 6 ఫోర్లు)తో కలిసి 7వ వికెట్‌కు 93 పరుగులు... మెహదీ హసన్ (62 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి 8వ వికెట్‌కు 60 పరుగులు జోడించి హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. ఇషాంత్ శర్మ 4 వికెట్లతో రాణించాడు. -
బెంగాల్ 289 ఆలౌట్
కోల్‌కతా: ఆంధ్ర బౌలర్లు చీపురుపల్లి స్టీఫెన్ (4/78), శశికాంత్ (4/64) తమ పేస్ బౌలింగ్‌తో హడలెత్తించడంతో బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 241/4తో గురువారం ఆట కొనసాగించిన బెంగాల్ మరో 48 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. వెలుతురు లేమి కారణంగా రెండో రోజు ఆట 21 ఓవర్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆంధ్ర ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. గాందీకి ప్రవేశం లేదు! ఆంధ్ర, బెంగాల్ రంజీ మ్యాచ్ సందర్భంగా వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. బెంగాల్ మాజీ క్రికెటర్, ప్రస్తుత సీనియర్ జట్టు సెలక్టర్ దేవాంగ్ గాంధీని బెంగాల్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌నుంచి అనూహ్యంగా బయటకు పంపించారు. సీనియర్ క్రికెటర్ మనోజ్ తివారి ఇందుకు కారణమని తెలుస్తోంది. టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది మాత్రమే ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రాకూడదనేది నిబంధన. గాంధీ అనుమతి లేకుండా వచ్చారని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే వారు అతడిని బయటకు పంపినట్లు సమాచారం. అయితే తాను ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని గాంధీ స్పష్టం చేశాడు. ఈ విషయంలో గాందీకి మద్దతుగా నిలిచిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తివారీపై చర్య తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు జట్టు బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్‌ను బహిరంగంగా తిట్టడం వల్లే ఈ మ్యాచ్‌లో సీనియర్ బౌలర్ అశోక్ దిండాను తప్పించినట్లు తెలిసింది. అతనిపై క్రమశిక్షణాచర్యల్లో భాగంగానే చివరి నిమిషంలో జట్టునుంచి దూరంగా ఉంచారు. -
హైదరాబాద్ 69 ఆలౌట్
న్యూఢిల్లీ: ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటై... ఫాలోఆన్‌లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పో యి 20 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే హైదరాబాద్ ఇంకా 195 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 269/6తో రెండో రోజు ఆట కొనసాగించిన ఢిల్లీ 71.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ అక్షత్ రెడ్డి (0) గోల్డెన్ డక్‌తో ఆరంభమైన హైదరాబాద్ పతనం రవి కిరణ్ (0) వరకు నిరాటంకంగా కొనసాగింది. హైదరాబాద్ టాప్ స్కోర్ సందీప్ చేసిన 16 పరుగులు కావడం గమనార్హం. -
ఢిల్లీకి ఆధిక్యం
న్యూఢిల్లీ: వెటరన్ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ కెరీర్ చివరి మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. ఆంధ్రతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలో దిగిన గంభీర్ (185 బంతుల్లో 112; 10 ఫోర్లు) శతకంతో ఆకట్టుకోగా... ధ్రువ్ షొరే (98; 6 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 409 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 190/1తో శనివారం ఆట కొనసాగించిన ఢిల్లీని ఆంధ్ర బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. గంభీర్ క్రితం రోజు స్కోరుకు 20 పరుగులు జతచేసి వెనుదిరగ్గా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత ధ్రువ్ తీసుకున్నాడు. అతను జాంటీ సిద్ధూ (30), లలిత్ యాదవ్ (29), అనూజ్ రావత్ (27)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో ఢిల్లీకి స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ ఖాన్, మనీశ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సాయి కృష్ణకు ఓ వికెట్ దక్కింది. చేతిలో మరో 3 వికెట్లు ఉన్న ఢిల్లీ ప్రస్తుతం 19 పరుగుల ముందుంది. వశిష్ట్ (12 బ్యాటింగ్), సుభోద్ భాటి (1బ్యాటింగ్) క్రీజు లో ఉన్నారు. ఆదివారం మ్యాచ్‌కు చివరి రోజు. -
బ్యాట్స్‌మెన్‌దే భారం
హైదరాబాద్ లక్ష్యం 219 ప్రస్తుతం 13/1 రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు హైదరాబాద్ ముందు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లకు సహకరిస్తున్న ఈ పిచ్‌పై ఇది కష్టసాధ్యమైన లక్ష్యమే కాగా... దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్సలో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (9) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (2 బ్యాటింగ్), బి. అనిరుధ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్రకే ఆధిక్యం మూడో రోజు ఆటలో ఆంధ్ర ఆటగాళ్లే పైచేయి సాధించారు. ముందుగా బౌలర్లు... శుక్రవారం 81/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను తొలి ఇన్నింగ్సలో 74.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ చేశారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పాటు మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో ఆంధ్రకు తొలి ఇన్నింగ్సలో 47 పరుగుల ఆధిక్యం లభించింది. టెరుులెండర్లలో సి.వి. మిలింద్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స టాప్ స్కోర్ కాగా... ఆకాశ్ భండారి 23 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, శివకుమార్, భార్గవ్ భట్ చెరో 2 వికెట్లు తీశారు. మొదటి రోజు ఆటలో ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో 190 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రాణించిన విహారి అనంతరం రెండో ఇన్నింగ్స ఆరంభించిన ఆంధ్ర జట్టు కూడా 51 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. భార్గవ్ భట్ (22), రవితేజ (22)లను సి.వి.మిలింద్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన హనుమ విహారి (54 బంతుల్లో 57; 5 ఫోర్లు) వేగంగా పరుగులు జతచేశాడు. ప్రశాంత్ (32 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (4/52) స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆంధ్రా వెన్నువిరిచాడు. క్రీజులో పాతుకుపోరుున విహారి, ప్రశాంత్‌లతో పాటు రికీ భుయ్ (2), ప్రణీత్ (10)లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తున్నట్లు గమనించిన ఆంధ్ర కెప్టెన్ విహారి... 29.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్‌సను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స ఆధిక్యం 47 పరుగులు కలుపుకొని హైదరాబాద్ ముందు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. -
హోరాహోరీగా హైదరాబాద్-ఆంధ్ర మ్యాచ్
లక్నో:హైదరాబాద్-ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్-సిలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర.. ఆ తరువాత హైదరాబాద్‌ను 143 పరుగులకే కట్టడి చేసింది. 81/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ మరో 62 పరుగులు సాధించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.హైదరాబాద్ ఇన్నింగ్స్ లో చామా మిలింద్(29 నాటౌట్) దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆంధ్ర బౌలర్ విజయ్ కుమార్ నాలుగు వికెట్లు సాధించగా,శివ కుమార్, భార్గవ్ భట్లు తలో రెండు వికెట్లు సాధించారు. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది పై గ్రూప్‌లోకి ప్రమోట్ అవుతాయి. హైదరాబాద్ ప్రస్తుతం 30 పాయింట్లతో నాకౌట్‌కు బాగా చేరువలో ఉంది. చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడిస్తే హనుమ విహారి నాయకత్వంలో ఆడుతోన్న ఆంధ్ర (ప్రస్తుతం 25 పాయింట్లు) జట్టుకూ ఆ అవకాశం ఉంటుంది. అయితే వీరికి పోటీగా 25 పాయింట్లతో ఉన్న హరియాణా, తమ చివరి మ్యాచ్‌లో త్రిపురలాంటి బలహీన జట్టుతో ఆడుతుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. హైదరాబాద్‌ను ఆంధ్ర ఓడించి, మరోవైపు హరియాణా గెలవకుండా ఉంటే... హైదరాబాద్, ఆంధ్ర కలిసి ముందుకు దూసుకెళతాయి. -
చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్
హైదరాబాద్ 81/5 ఆంధ్రతో రంజీ ట్రోఫీ మ్యాచ్ లక్నో: బౌలర్ల ప్రదర్శనతో తొలి రోజు ఆటలో పైచేయి సాధించిన హైదరాబాద్... బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రెండో రోజు విలవిలలాడింది. ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆటకొనసాగించిన హైదరాబాద్ ఆట నిలిచే సమయానికి 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఆంధ్ర పేసర్లు విజయ్ కుమార్ (2/18), శివ కుమార్ (2/30) టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట నిలిచే సమయానికి అనిరుధ్ (26 బ్యాటింగ్), కె. సుమంత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఉదయం పొగమంచు కారణంగా ఆట సాధ్యపడలేదు. దీంతో తొలి సెషన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ విరామం తర్వాతే ఆట కొనసాగగా... కేవలం 38 ఓవర్లే జరిగాయి. తన్మయ్ విఫలం గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సల్లో సెంచరీలు సాధించిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (12) విఫలమయ్యాడు. అతనితో కలిసి రెండో రోజు ఆట కొనసాగించిన అక్షత్ రెడ్డి (10) మొదట పెవిలియన్ చేరాడు. ఆట మొదలైన మరుసటి ఓవర్లోనే అక్షత్‌ను విజయ్ కుమార్ ఔట్ చేశాడు. తర్వాత కెప్టెన్ బద్రీనాథ్ (5)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 21 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం కాసేపటికే శివకుమార్ బౌలింగ్‌లో తన్మయ్ క్లీన్బౌల్డయ్యా డు. మరో రెండు పరుగులు చేరాయో లేదో... జట్టు స్కోరు 36 పరుగుల వద్ద మళ్లీ శివ కుమార్ హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. బావనక సందీప్ (2)నూ పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో అనిరుధ్, హిమాలయ్ అగర్వాల్ (22) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించాక హిమాలయ్ రనౌటై వెనుదిరిగాడు. హైదరాబాద్ చేతిలో ఇంకా 5 వికెట్లుండగా... 109 పరుగుల వెనుకంజలో ఉంది. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 190 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స: తన్మయ్ (బి) శివకుమార్ 12; అక్షత్ (సి) భరత్ (బి) విజయ్ 10; బద్రీనాథ్ (సి) ప్రశాంత్ (బి) విజయ్ 5; అనిరుధ్ బ్యాటింగ్ 26; సందీప్ (సి) భరత్ (బి) శివకుమార్ 2; హిమాలయ్ రనౌట్ 22; కె. సుమంత్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (45 ఓవర్లలో 5 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1-11, 2-21, 3-34, 4-36, 5-81 బౌలింగ్: విజయ్ 16-8-18-2, శివకుమార్ 15-5-30-2, భార్గవ్ 5-2-15-0, స్టీఫెన్ 9-3-17-0. -
బెంబేలెత్తించిన మిలింద్, రవికిరణ్
ఆంధ్ర 190 ఆలౌట్ రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ లక్నో: హైదరాబాద్ పేసర్లు సీవీ మిలింద్ (5/28), రవికిరణ్ (4/33) చెలరేగారు. ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. దీంతో మొదటిరోజు ఆటలోనే ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స 59 ఓవర్లలో 190 పరుగుల వద్ద ముగిసింది. ప్రణీత్ (88 బంతుల్లో 63; 11 ఫోర్లు), అశ్విన్ హెబ్బర్ (63 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అకాశ్ భండారీకి ఒక వికెట్ దక్కింది. తర్వాత తొలి ఇన్నింగ్స ఆడిన హైదరాబాద్ ఆట నిలిచే సమయానికి వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (1 బ్యాటింగ్), అక్షత్ రెడ్డి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తడబడిన ఆంధ్ర బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర 4 పరుగుల వద్దే ఓపెనర్ శ్రీకర్ భరత్ (3) వికెట్‌ను కోల్పోయింది. అతన్ని క్లీన్‌బౌల్డ్ చేసిన రవికిరణ్ ఆంధ్ర పతనాన్ని శాసించాడు. తర్వాత మరో ఓపెనర్ ప్రశాంత్ (27), విహారి (17)తో కలిసి కాసేపు కుదురుగా ఆడారు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద రవికిరణ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విహారి, రికీ భుయ్ (0)లను ఔట్ చేశాడు. అదే స్కోరు వద్ద ప్రశాంత్ కూడా భండారీ బౌలింగ్‌లో నిష్క్రమించడంతో ఆంధ్ర 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాణించిన ప్రణీత్, అశ్విన్ ఈ దశలో ప్రణీత్, అశ్విన్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం 171 పరుగుల జట్టు స్కోరు వద్ద మొదట అశ్విన్‌ను రవికిరణ్ ఔట్ చేశాడు. తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మిలింద్... ప్రణీత్, శివ కుమార్ (0), సీవీ స్టీఫెన్ (0)లను పెవిలియన్ పంపాడు. తర్వాత భార్గవ్ భట్ (12) కూడా మిలింద్ బౌలింగ్‌లోనే నిష్క్రమించడంతో ఆంధ్ర ఇన్నింగ్స 190 పరుగుల వద్ద ముగిసింది. -
ఒకే రోజు 18 వికెట్లు...
ఛత్తీస్‌గఢ్ 188 ఆలౌట్ రెండో ఇన్నింగ్సలో హైదరాబాద్ 115/9 రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ వల్సాడ్: హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లు మెరిశారు. దీంతో ఒక్క రోజే 18 వికెట్లు నేలకూలారుు. మొదట హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఛత్తీస్‌గఢ్ 85.1 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స ఆడిన హైదరాబాద్ కూడా తడబడింది. ఆట నిలిచే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోరుు 115 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ 278 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాణించిన ఆకాశ్, మిలింద్ మూడో రోజు లభించిన పిచ్ సహకారాన్ని హైదరాబాద్ బౌలర్లు ఆకాశ్ భండారి (3/27), సీవీ మిలింద్ (3/47), సిరాజ్ (2/36), మెహదీ హసన్ (2/39) సద్వినియోగం చేసుకున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోకుండా దెబ్బతీశారు. దీంతో బుధవారం 124/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఛత్తీస్‌గఢ్ అనూహ్యంగా మరో 64 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లు కోల్పోరుుంది. ఆట మొదలైన తొలి ఓవర్ రెండో బంతికే మిలింద్... అభిమన్యు చౌహాన్ (55)వికెట్ తీయడంతో ఛత్తీస్‌గఢ్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన వారిలో కాంత్ సింగ్ 22, అశుతోష్ సింగ్ 17, మహ్మద్ కైఫ్ 11 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్సలో 163 పరుగుల ఆధిక్యం లభించింది. విజృంభించిన పంకజ్, అభిషేక్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన ఆనందంతో రెండో ఇన్నింగ్స ప్రారంభించిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలిచేందుకు అపసోపాలు పడ్డారు. పంకజ్ (4/37), అభిషేక్ తమ్రకర్ (4/19) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్ కోలుకోలేదు. ఓపెనర్ తన్మయ్ గాయం కారణంగా బెంజమిన్ థామస్ (19)తో కలిసి అక్షత్ రెడ్డి (4) ఇన్నింగ్స ఆరంభించాడు. అరుుతే 34 పరుగులకే ఓపెనర్లిద్దరిని పంకజ్ పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ బద్రీనాథ్ (11) సహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. లోయర్ మిడిలార్డర్లో భండారి (29 బ్యాటింగ్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆట నిలిచే సమయానికి ఇతనితో పాటు రవికిరణ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తన్మయ్ తలకు గాయం హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. మనోజ్ సింగ్ కొట్టిన పుల్ షాట్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న తన్మయ్ తలకు బలంగా తగిలింది. వెంటనే అతడిని అంబులెన్సలో ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. అయితే కోలుకొని తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన తన్మయ్ ఐదు బంతులాడి డకౌట్ అయ్యాడు. -
59 పరుగులకు ఆలౌట్!
కోల్‌కతా:రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టు సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో విదర్భను తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులకే కుప్పకూల్చింది. మహారాష్ట్ర మీడియం పేసర్ అనుపమ్ సంక్లేచా ఏడు వికెట్లతో అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 11 ఓవర్లలో 25 పరుగులిచ్చిన అనుపమ్.. ఏడు వికెట్లు సాధించి విదర్భ వెన్నువిరిచాడు. విదర్భ ఆటగాడు శ్రీవాస్తవ (19) ఒక్కడే రెండంకెల మార్కును చేరగా, మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజట్ కే పరిమితమయ్యారు. ఇది విదర్భకు రంజీల్లో ఐదో అత్యల్ప స్కోరు. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 332 పరుగులు చేసింది. నౌషద్ షేక్(127),అంకిత్ బావ్నే(111) శతకాలతో మెరిశారు. -
హైదరాబాద్‌ను ఆదుకున్న సందీప్, హసన్
ముంబై: ఓపెనర్ అక్షత్ రెడ్డి (64; 9 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ అనిరుధ్ (49; 7 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ భాగస్వామ్యం అందించడం... ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ తడబడటం... చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... సర్వీసెస్‌తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ గౌరవప్రద స్కోరును సాధించడంలో సఫలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 89 ఓవర్లలో 7 వికెట్లకు 303 పరుగులు సాధించింది. వికెట్ నష్టానికి 136 పరుగులతో పటిష్టంగా కనిపించిన హైదరాబాద్... ఒక్కసారిగా 7 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ బద్రీనాథ్ (0) ఖాతా తెరువకుండానే రనౌట్ కాగా... వికెట్ కీపర్ కొల్లా సుమంత్ (0) కూడా డకౌట్ అయ్యాడు. ఆకాశ్ భండారి (4) నిరాశపరిచాడు. దాంతో 6 వికెట్లకు 141 పరుగులతో డీలాపడిన హైదరాబాద్‌ను బావనాక సందీప్ (129 బంతుల్లో 83 బ్యాటింగ్; 11 ఫోర్లు), లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ (83 బంతుల్లో 61; 11 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి ఏడో వికెట్‌కు 135 పరుగులు జతచేశారు. హసన్ అవుటయ్యాక సీవీ మిలింద్ (14 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి సందీప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో రౌషన్ రాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. -
రిషబ్ పంత్ బ్యాటింగ్ రికార్డు
త్రివేండ్రం:ఈ రంజీ సీజన్లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. గ్రూప్ -బిలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ అత్యంత వేగంగా సెంచరీ బాదాడు. ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 48 బంతుల్లో శతకం సాధించి రంజీ చరిత్రలో వేగవంతంగా ఆ ఘనతను నమోదు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్‌గా 135 పరుగులు చేసిన రిషబ్.. 8 ఫోర్లు, 13 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. దాంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక మ్యాచ్‌లో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రిషబ్ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఎనిమిది సిక్సర్లు కొట్టిన రిషబ్.. రెండో ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లను కొట్టాడు. అయితే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మున్రో పేరిట ఉంది. 2015లో మున్రో ఒక మ్యాచ్ లో 23 సిక్సర్లు సాధించాడు. ఇదిలా ఉండగా, ఈ సీజన్లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ ట్రిపుల్ సాధించిన సంగతి తెలిసిందే. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ 308 పరుగులు సాధించాడు.తాజాగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి మరోసారి మెరిశాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాజేశ్ బారోహ్, వీబీ చంద్రశేఖర్ లు సంయుక్తంగా 56 బంతుల్లో నమోదు చేసిన ఫాస్టెస్ట్ రికార్డు చెరిగిపోయింది. -
విజయం దిశగా పంజాబ్
ఉత్తర్ ప్రదేశ్‌తో రంజీ మ్యాచ్ హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో విజయానికి కేవలం 51 పరుగుల దూరంలో నిలిచింది. పంజాబ్ చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నారుు. 243/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం తొలిఇన్నింగ్సను ప్రారంభించిన పంజాబ్‌ను బౌలర్లు అంకిత్ రాజ్‌పుత్ (3/58), ఇంతియాజ్ అహ్మద్ (3/57) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి ఓవర్‌నైట్ స్కోరుకు మరో 76 పరుగులు జోడించి పంజాబ్ ఆలౌటైంది. యువరాజ్ (85), మన్దీప్ సింగ్ (63) రాణించారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు 16 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స ప్రారంభించిన ఉత్తర్‌ప్రదేశ్... 38.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ (6/27) చెలరేగి ఉత్తర ప్రదేశ్ వెన్నువిరిచాడు. యూపీ జట్టులోరింకు సింగ్ (43 నాటౌట్) టాప్ స్కోరర్. తర్వాత 112 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 18 ఓవర్లలో 2 వికెట్లకు 61 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (34), జీవన్ జోత్ సింగ్ (27 నాటౌట్) తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఉదయ్ కౌల్ (0 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నాడు. -
పంజాబ్ దీటైన జవాబు
రాణించిన యువరాజ్ యూపీతో రంజీ మ్యాచ్ హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో యువరాజ్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం స్థాయికి తగిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 3 వికెట్లకు 243 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (107 బంతుల్లో 72 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించాడు. మనన్ వోహ్రా (59), జీవన్‌జ్యోత్ సింగ్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సౌరభ్ కుమర్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 300/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఉత్తర్‌ప్రదేశ్ మరో 35 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్సలో మొత్తం 102.5 ఓవర్లలో 335 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (71), సౌరభ్‌కుమార్ (52) రాణించారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా... శుబేక్ సింగ్ గిల్ 3 వికెట్లు పడగొట్టాడు. -
22 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లు
రాయ్‌పూర్:దేశవాళీ లీగ్‌ల్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడా కుప్పకూలింది. గ్రూప్-ఎలో తమిళనాడుతో శనివారం ఆరంభమైన మ్యాచ్‌లో బరోడా తొలి ఇన్నింగ్స్ లో 93 పరుగులకే చాపచుట్టేసింది. 71 పరుగుల వరకూ వికెట్ మాత్రమే కోల్పోయి పోటీనిస్తున్నట్లు కనబడిన బరోడా.. ఆపై మరో 22 పరుగులు చేసి మిగతా తొమ్మిది వికెట్లను నష్టపోయింది. తమిళనాడు మీడియం పేసర్లు కృష్ణమూర్తి విఘ్నేష్, అశ్విన్ క్రిష్ట్లు బరోడాను చావు దెబ్బ తీశారు. విఘ్నేష్ ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ క్రిష్ట్కు నాలుగు వికెట్లు తీశాడు. బరోడా ఆటగాళ్లలో దేవ్ ధార్(26), మిస్త్రీ(23), సోలంకి(14)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్లుగా వెనుదిరిగారు. ఆ తరువాత 79/1 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్న తమిళనాడు లంచ్ ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకుంద్(100)శతకం సాధించాడు. -
జమ్మూ కశ్మీర్‌కు ఆధిక్యం
ముంబై: ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌కు తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. శనివారం మూడో రోజు ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో 99.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటరుుంది. రవితేజ (81), ప్రదీప్ (47) రాణించారు. జమ్మూ బౌలర్లలో అజీజ్ ఐదు, రసూల్ మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సలో 79 పరుగుల ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్ జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 18.5 ఓవర్లలో రెండు వికెట్లకు 31 పరుగులు చేసింది. హైదరాబాద్ తడబాటు భువనేశ్వర్‌లో కేరళతో జరగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 87 ఓవర్లలో ఏడు వికెట్లకు 231 పరుగులు చేసింది. సందీప్ (53) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్‌సను 181 ఓవర్లలో 9 వికెట్లకు 517 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
పసలేని హైదరాబాద్ బౌలింగ్
భువనేశ్వర్: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకొని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇక్బాల్ అబ్దుల్లా (214 బంతుల్లో 157 బ్యాటింగ్; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో కేరళ తొలి ఇన్నింగ్సలో భారీస్కోరు చేసింది. శుక్రవారం 223/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కేరళ ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ సచిన్ బేబి (209 బంతుల్లో 80; 8 ఫోర్లు), జలజ్ సక్సేనా (130 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఐదో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. జలజ్ నిష్ర్కమణ తర్వాత వచ్చిన ఫెర్నాండెజ్ (12) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను తలపించాడు. పసలేని హైదరాబాద్ బౌలింగ్‌పై సుదీర్ఘ ఇన్నింగ్‌సకు శ్రీకారం చుట్టాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత పరుగుల వరద పారించాడు. అదును చిక్కినప్పుడల్లా భారీ సిక్సర్లతో అలరించాడు. ఇతనికి మొదట సచిన్ బేబి, తర్వాత మోనిశ్ (152 బంతుల్లో 40; 4 ఫోర్లు) చక్కని సహకారం అందించారు. మోనిశ్ అండతో సెంచరీ పూర్తి చేసుకున్న ఇక్బాల్ అబ్దుల్లా తర్వాత కూడా తన జోరు తగ్గించలేదు. కుదురుగా ఆడుతూ 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు. దీంతో జట్టు స్కోరు 500 పరుగులు దాటింది. ఆట ముగిసే సమయానికి ఇతనితో పాటు సందీప్ వారియర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్‌కు 3 వికెట్లు దక్కాయి. రవికిరణ్ 2, సి.వి.మిలింద్, సిరాజ్, ఆకాశ్ భండారీ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
90 పరుగులకే కుప్పకూలింది!
కోల్ కతా: దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో భాగంగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ విలవిల్లాడింది. గ్రూప్ -బిలో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్ లో 35.5 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఉన్ముక్త్ చంద్(0), గౌతం గంభీర్(2) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. అలా మొదలైన ఢిల్లీ పతనం కడవరకూ కొనసాగింది. అయితే మధ్యలో రిషబ్ పంత్(24), షోరే(24)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆ జట్టు స్వల్ప పరుగులకే పరిమితమైంది. కర్ణాటక బౌలర్లు ఎస్ అరవింద్ నాలుగు వికెట్లు, గౌతమ్ మూడు వికెట్లు, మిథున్ రెండు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా శుక్రవారం రెండో రోజు లంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. -
చెలరేగిన దినేశ్ కార్తీక్
బిలాస్పూర్: రైల్వేస్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు దినేశ్ కార్తీక్ చెలరేగిపోయాడు. తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో దినేశ్ కార్తీక్(163;145బంతుల్లో 24 ఫోర్లు) భారీ శతకం సాధించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. గ్రూప్-ఎలో భాగంగా రైల్వేస్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంద్రజ్ జిత్(52)తో కలిసి దినేశ్ కార్తీక్ 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు కెప్టెన్ అభినవ్ ముకుంద్(100;181 బంతుల్లో 10 ఫోర్లు) శతకం సాధించాడు. వీరితో పాటు రంగరాజన్(51 నాటౌట్), కౌశిక్ గాంధీ(42) రాణించడంతో తమిళనాడు తన రెండో ఇన్నింగ్స్ ను ఎనిమిది వికెట్ల నష్టానికి 452 పరుగుల వద్ద ఉండగా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో తమిళనాడు 121 పరుగులకు ఆలౌట్ కాగా, రైల్వేస్ మొదటి ఇన్నింగ్స్ లో 173 పరుగులు చేసింది. దాంతో రైల్వేస్ కు తమిళనాడు 401 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రైల్వేస్ చివరి రోజైన నాల్గో రోజు లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా రైల్వేస్ విజయానికి 226 పరుగులు అవసరం కాగా, తమిళనాడు గెలుపుకు ఏడు వికెట్లు అవసరం. -
చహాల్ చేతిలో ఢమాల్
జంషెడ్పూర్: సీజన్ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆశలు రేపిన హైదరాబాద్ రంజీ జట్టు రెండో మ్యాచ్‌లో తడబడింది. హరియాణాతో ఇక్కడ కీసన్ స్టేడియంలో ప్రారంభమైన గ్రూప్-సి మ్యాచ్‌లో జట్టు బ్యాట్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా తొలి రోజు హైదరాబాద్ 82.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. సందీప్(120 బంతుల్లో 44;5 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడాడు. హరియాణా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్(6/44) ఆరు వికెట్లతో హైదరబాద్ వెన్నువిరిచాడు. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే ఆరంభంలోనే తన్మయ్(13) రనౌట్ కాగా,మరుసటి ఓవర్లోనే అక్షత్ రెడ్డి(13)ని హర్హల్ పటేల్ బౌల్డ్ చేశాడు. అనిరుథ్(17),కెప్టెన్ బద్రీనాథ్(27) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. ఈ దశలో సందీప్, కొల్లా సుమంత్ కలిసి జట్టును ఆదుకునే యత్నం చేశారు.వీరిద్దరూ ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.అయితే తక్కువ వ్యవధిలోనే వీరిద్దర్ని అవుట్ చేసి చహాల్ హైదరాబాద్‌ను దెబ్బతీశాడు. లోయర్ ఆర్డర్లో ఎవరూ నిలబడలేకపోవడంతో జట్టు 14 పరుగుల వ్యవధిలో మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. దాంతో చహాల్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గతంలో 21 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయని అతను ఈ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడం విశేషం. -
ఆంధ్ర 203 ఆలౌట్
తమిళనాడుతో రంజీ మ్యాచ్ చెన్నై: తమిళనాడుతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి రోజే కుప్పకూలింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రదీప్ (159 బంతుల్లో 78; 6 ఫోర్లు; 1 సిక్స్), భరత్ (123 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా రికీ భుయ్ (65 బంతుల్లో 35; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. చంద్రశేఖర్‌కు నాలుగు, రంగరాజన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడు ఒక ఓవర్ ఆడగా పరుగులేమీ చేయలేదు. -
రెండో రోజే ఆంధ్ర ఓటమి
* దెబ్బతీసిన గుర్కీరత్ * ఏడు వికెట్లతో పంజాబ్ విజయం పటియాల: పంజాబ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం వహించిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియగా పంజాబ్ ఏడు వికెట్లతో నెగ్గింది. ఈ విజయంతో పం జాబ్‌కు ఆరు పాయింట్లు దక్కాయి. తొలి ఇన్నిం గ్స్‌లో 80 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర.. శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 41.4 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్ గుర్కీరత్ సింగ్ (5/38) కెరీర్ ఉత్తమ గణాంకాలతో రెచ్చిపోయి ఆంధ్రను వణికించాడు. ఓపెనర్ శ్రీకర్ భరత్ (45 బంతుల్లో 39; 6 ఫోర్లు), ప్రశాంత్ (82 బంతుల్లో 29; 2 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్లు. రజ్వీందర్ సింగ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 67 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 55 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రశాం త్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. మొత్తం తొమ్మిది వికెట్లతో గుర్కీరత్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలడం విశేషం. హైదరాబాద్ 113/2 సాక్షి, హైదరాబాద్: జమ్ము అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 57 బ్యాటింగ్; 8 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీ సహాయంతో హైదరాబాద్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో రెండు వికెట్లకు 113 పరుగులు చేసింది. క్రీజులో అక్షత్ రెడ్డి (15 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం ప్రత్యర్థికన్నా 347 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు కశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 131.2 ఓవర్లలో 460 పరుగులకు ఆలౌటయింది. రసూల్ (120 బంతుల్లో 75; 12 ఫోర్లు), రాయ్ దయాల్ (109 బంతుల్లో 48;7 ఫోర్లు) రాణించారు. అన్వర్ అహ్మద్‌కు ఐదు వికెట్లు దక్కాయి. -
ఓజా యాక్షన్ క్లియర్
రంజీ మ్యాచ్ ఆడనున్న స్పిన్నర్ న్యూఢిల్లీ: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు ఊరట లభించింది. సందేహాస్పద యాక్షన్‌తో నిషేధానికి గురైన ఈ హైదరాబాద్ బౌలర్ తన బౌలింగ్‌ను సరిదిద్దుకున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్‌ను సరైనదిగా నిర్ధారిస్తూ తాజాగా బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో అతను శుక్రవారంనుంచి ఉప్పల్‌లో హిమాచల్‌ప్రదేశ్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ‘అవును, నా యాక్షన్‌ను సరైనదిగా గుర్తిస్తూ బీసీసీఐ మెయిల్ పంపించింది. ఇకపై నేను పోటీ క్రికెట్ బరిలోకి దిగవచ్చు. ఇన్నాళ్ల నా వేదన తీరింది. ఇక ఈ అంకం ముగిసినట్లే’ అని ఓజా చెప్పాడు.