రెండో రోజే ఆంధ్ర ఓటమి
* దెబ్బతీసిన గుర్‌కీరత్
* ఏడు వికెట్లతో పంజాబ్ విజయం
పటియాల: పంజాబ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం వహించిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియగా పంజాబ్ ఏడు వికెట్లతో నెగ్గింది. ఈ విజయంతో పం జాబ్‌కు ఆరు పాయింట్లు దక్కాయి. తొలి ఇన్నిం గ్స్‌లో 80 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర.. శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 41.4 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది.
స్పిన్నర్ గుర్‌కీరత్ సింగ్ (5/38) కెరీర్ ఉత్తమ గణాంకాలతో రెచ్చిపోయి ఆంధ్రను వణికించాడు. ఓపెనర్ శ్రీకర్ భరత్ (45 బంతుల్లో 39; 6 ఫోర్లు), ప్రశాంత్ (82 బంతుల్లో 29; 2 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్లు. రజ్వీందర్ సింగ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 67 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 55 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రశాం త్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. మొత్తం తొమ్మిది వికెట్లతో గుర్‌కీరత్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలడం విశేషం.
హైదరాబాద్ 113/2
సాక్షి, హైదరాబాద్: జమ్ము అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 57 బ్యాటింగ్; 8 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీ సహాయంతో హైదరాబాద్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో రెండు వికెట్లకు 113 పరుగులు చేసింది. క్రీజులో అక్షత్ రెడ్డి (15 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం ప్రత్యర్థికన్నా 347 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు కశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 131.2 ఓవర్లలో 460 పరుగులకు ఆలౌటయింది. రసూల్ (120 బంతుల్లో 75; 12 ఫోర్లు), రాయ్ దయాల్ (109 బంతుల్లో 48;7 ఫోర్లు) రాణించారు. అన్వర్ అహ్మద్‌కు ఐదు వికెట్లు దక్కాయి.